తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉందని అన్నారు.
భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీఆర్ఎస్పై అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అక్బరుద్దీన్ అన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి..? అని ప్రశ్నించారు.
KTR Comment: ఫార్ములా ఈ రేస్ పై కేబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రేస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా?
CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి ప్రాధాన్యత ఇచ్చారు.
ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోతే.. రేవంత్ సర్కార్ వచ్చన తర్వాత మరో లక్ష కోట్లు పెరిగాయన్నారు.
పేద ప్రజల పొట్ట కొట్టి పెద్దలకు పంచడమే మూసీ ప్రాజెక్ట్ లక్ష్యంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శాసనమండలి మీడియా పాయింట్ దగ్గర కవిత మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం గురివింద గింజ సామెతను తలపిస్తోందని.. అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు బన్నీని అరెస్టు చేయగా బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ప్రబుత్వంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత కామెంట్స్ చేస్తూ…