ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తాము అనుమానించినట్లు గానే కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన, మోసంకు పర్యాయపదం అని రుజువు అయిందని అన్నారు. జనవరి 26న రైతు భరోసా పేరుతో మోసం చేయడానికి సిద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఎన్నికలకు ఆర్నెళ్లకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీ ఇచ్చింది.. భూయజమానులకు, కౌలు రైతులకు రైతు భరోసాం ఇస్తాం అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు. మీరు పదివేలు బిచ్చం వేస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అన్నారని చెప్పారు.
Read Also: Andhra Pradesh: న్యూమో వైరస్ గురించి భయాందోళనలు అవసరం లేదు..
ఇదే మాటను ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ వరంగల్‌లో చెప్పారని కేటీఆర్ తెలిపారు. పదిహేను వేలు ఎకరానికి ఇస్తాం అని చెప్పి.. పన్నెండు వేలు ఇస్తాం అని నయవంచన చేశారని దుయ్యబట్టారు. ఇలా చేసే తెలంగాణ రైతులను మోసం చేశారు.. నయవంచన, మోసం అనే పదాలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాబందుగా మిగిలి పోతారని కేటీఆర్ తెలిపారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. దాటిన తర్వాత బోడ మల్లన్న అనేది కాంగ్రెస్ పార్టీ నైజం అని మరోసారి నిజమైందని ఆరోపించారు.
Read Also: AP Crime: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గర్భవతైన మైనర్ బాలిక!
ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు వెంటబడతాం.. కాంగ్రెస్ నేతలు ఎక్కడ కనబడినా రైతులు నిలదీయాలని కేటీఆర్ తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపు ఇస్తున్నాం.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిరసనలు చేస్తామని అన్నారు. రైతులకు సపోర్ట్‌గా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపు ఇస్తుందని చెప్పారు. జనవరి 26 వరకు చూసి ఉద్యమం ఉధృతం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గండం తప్పించుకోవడానికి ఇప్పుడు ఇస్తాం అంటున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పూర్తిగా ఈ రైతు భరోసా ఆపేస్తారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని కేటీఆర్ అన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేయబోతోందని చెప్పారు.