తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో చేయాలని ఉన్నా ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్షణ దీక్షా శిబిరాన్ని కేఏ.పాల్ సందర్శించి మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రూ.5లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా.. ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల అప్పుతో కూరుకుపోయిందన్నారు. కరీంనగర్ ఎంపీ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నా చేయలేరన్నారు. తాను వెళ్తే తనతో నిలబడే మాట్లాడతారని చెప్పారు. ఢిల్లీ వెళ్తున్నాను.. సమగ్ర శిక్షణ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయకుంటే స్థానిక ఎన్నికల్లో బీజేపీని, కాంగ్రెస్‌ను, బీఆర్ఎస్‌ను ఓడించి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Winter Season: చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఈ గింజల్ని తింటే సరి