జనవరి 11 నుంచి 17 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు..
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం, పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఉండగా, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు హాలిడేలు ప్రకటించాయి. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రభుత్వం ఈసారి రెండు రోజుల ముందుగానే సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మార్పుతో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి పండుగ ప్రణాళికలను ముందుగానే చేయగలిగే పరిస్థితి ఏర్పడింది.
గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి సంచారం..!
గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుంది. పులి కదలికలపై స్థానికుల్లో భయాందోళనలు నెలకున్నాయి. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తున్న సమయంలో పులి రోడ్డు దాటడం చూసినట్టు ఆర్టీసీ కండక్టర్ రవి కిరణ్ చెబుతున్నాడు. ఆగిరిపల్లి మండలం కళ్ళుటూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ బొకినల రవి కిరణ్ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా పులిని చూశాడు. కండక్టర్ రవి ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో గన్నవరంకు బైక్ పై డ్యూటీకి వెళ్తుండగా మార్గ మధ్యలో సగ్గురు, మెట్లపల్లి దారి మధ్యలో ఒక పులి పిల్లను చూసినట్టు చెబుతున్నాడు.
సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్
రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.12 వేలకు తగ్గించి తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది . కాపు సామాజిక వర్గానికి సంఘీభావంగా అన్ని జిల్లాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని, దానికి బదులు రూ.12 వేలకు తగ్గించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆరోపించారు. . ఇలాంటి మోసాన్ని రైతులు సహించబోరని అన్నారు.
అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని నిర్మాణాలు చట్టవిరుద్ధం
అయ్యప్ప సొసైటీ కూల్చివేత లపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రకటన విడుదల చేశారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. గతంలో స్లాబ్‌పై కొన్ని రంధ్రాలు చేయబడ్డాయని, బిల్డర్ రంధ్రాలను మూసివేసి 7 అంతస్తుల అక్రమ నిర్మాణానికి ముందుకొచ్చాడన్నారు. హైకోర్టులో ధిక్కార పిటిషన్ కూడా దాఖలైంది, విచారణలో ఉందని ఆయన తెలిపారు. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని నిర్మాణాలు చట్టవిరుద్ధమని, ప్రస్తుతం కూల్చివేసిన భవనాన్ని అక్రమంగా నిర్మించేందుకు అనుమతించినందుకు బాధ్యులైన అధికారులపై నివేదిక ఇస్తామన్నారు ఏవీ రంగనాథ్. చర్యల కోసం ప్రభుత్వానికి కూడా పంపుతామని, ఈ అక్రమ భవనాల్లోనే అయ్యప్ప సొసైటీలో అనేక హాస్టళ్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. నిరీక్షణ తప్పదు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం ఎనిమిది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
‘గేమ్ చేంజర్’ సినిమాపై ఎస్ జే సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. మరో రెండు వారాల్లో ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి మొదలు కానుంది. ఈ సినిమాపై చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
“వక్ఫ్” భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది యోగి సర్కార్. మరికొన్ని రోజుల్లో కుంభమేళా ప్రారంభం కాబోతోంది. అయితే, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని, దీనికి అనుమతించడం ద్వారా ముస్లింలు పెద్ద మనసుని చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముస్లింలను కూడా అనుమతించడం ద్వారా హిందువులు ప్రతిస్పందించాలని కోరారు.
రేపు ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిచనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్‌ను సౌకర్యవంతంగా అందిస్తుంది.
8న విశాఖకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈనెల 8న మోడీ విశాఖకు రానున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్ పై దృష్టి పెట్టారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా వైజాగ్ వెళ్లి మరీ సమీక్ష నిర్వహించారు. మరోవైపు.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వైజాగ్‌లో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు