బీహార్ కొత్త స్పీకర్‌గా నంద కిషోర్ బీహార్ అసెంబ్లీలో (Bihar) సోమవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌కుమార్ సర్కార్ (Nitish Kumar) విజయం సాధించింది. 129 మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు మద్దతుగా నిలిచారు. ఇక కొత్త స్పీకర్‌గా బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్ (Nand Kishore Yadav )పేరు ఖరారైంది. మంగళవారం ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ బలపరీక్షకు ముందు మహాకూటమిలో స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీకి చెందిన అవథ్ బిహారీ చౌదరిపై అధికార…
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి ఇప్పటి వరకు 44 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు 44 ఏళ్ల నుండి 46 ఏళ్లకు పెంచింది రేవంత్‌రెడ్డి సర్కార్..
Assembly Budget Session: సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు చర్చ ప్రారంభం కానుంది.
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.
తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ చర్యలు.. తిరుపతి పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు పోలీసులపై వేటు వేసింది. అప్పటి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివప్రసాద్ లను సస్పండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీరితో పాటు తూర్పు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డిలను సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్ కు బదిలీ చేశారు. తిరుపతి…
పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్, రీపోలింగ్‌కి ఆదేశం.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా ఆందోళనలు.. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. దీంతో ఆ దేశంలో విజేత ఎవరనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఎన్నికల్లో…
Auto Drivers: ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేస్తున్నారు.