భద్రాద్రి రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రుల బృందం దర్శించుకుంది. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి తోపాటు మంత్రులకు పూర్ణకుంభంతో ఎండోమెంట్ కమిషనర్,ఈవో , అర్చకులు,వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో మూలమరుల వద్ద ముఖ్యమంత్రి , క్యాబినెట్ మంత్రుల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికతో పాటు వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి,మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు పోదెం వీరయ్య, స్థానిక శాసనసభ్యులు పెళ్ళాం వెంకట్రావు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పాల్గొన్నారు.
Harish Rao : కేసీఆర్ వచ్చాక గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశాం
అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా తొలిరోజు ప్రధాన ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకటి రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.కాగా, మరికొద్దిసేపట్లో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పేదలకు- ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షల సాయం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.