ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యమ స్ఫూర్తీతో పని చేయాల్సిన నాటి ప్రభుత్వం గాలికి వదిలేసింది అని విమర్శించారు. కల్వకుంట్ల ఉద్యోగాలు ఊడగొట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.
భద్రాద్రిలో రాములవారి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సెక్టార్ లో అవినీతిని పూర్తిగా అంతరించాలి అని పేర్కొన్నారు.
CM Revanth Reddy Speech in Adilabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే తమ విధానం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నానన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని, అభివృద్ధి విషయంలో మాత్రం కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆదిలాబాద్లో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధానికి సీఎం స్వాగతం…
ఎంసీహెచ్ఆర్డీలో ‘గవర్నర్పేట్ టు గవర్నర్స్ హౌజ్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకావడం ఒక మంచి అవకాశంగా భావిస్తున్నానన్నారు. 76 సంవత్సరాల్లో అన్నింటిపై అవగాహన పొందిన పెద్దలందరిని ఇక్కడ కలుసుకోవడం గొప్ప అనుభూతి అని, జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందన్నారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. వారి తరువాత జైపాల్…
నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్.. త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దీంతో గులాబీ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు రానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 10…
కేంద్రం జోక్యంతో భారతీయ యాప్ల పునరుద్ధరణకు అంగీకరించిన గూగుల్.. సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం గూగుల్ 10…