భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బుటకపు వాగ్దానాలు చేసి తెలంగాణా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం చేసి కేసీఆర్ ను బొంద తీసి పెట్టారని విమర్శించారు. ఇదిలా ఉంటే.. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు ప్రవేశ పెట్టుకున్నాం.. మనం ప్రటించిన గ్యారంటీలో ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పథకం, 200 యూనిట్లకు ఉచిత కరెంటు ఇస్తున్నాం.. ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు పంచే పని చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
CAA: అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
మీ జిల్లాలో ఒక ఒంటి కన్ను చేప్రసి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పై ఎద్దేవా చేసారు. ప్రొద్దున్నే లేచి అయ్యా, కొడుకు, అల్లుడు, బిడ్డా కాంగ్రెస్ పార్టీ పై శాపనాలు పెడుతున్నారు.. పిల్లి శాపనాలకు ఉట్టి తెగుతాదా అని వారినే అడుగుతున్నని అన్నారు. మరోవైపు.. హరీష్ రావు దూళం లాగే పెరిగిండు కానీ, దూడకు ఉన్న బుద్ది లేదని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కటే.. బీజేపీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ని కులుస్తాం అంటున్నారు.. బీజేపీకి ఉన్నవే ఎనిమిది.. బీఆర్ఎస్ తో పోత్తుతో కుల్చాలని చూస్తుండని పేర్కొన్నారు.
PM Modi: డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందించిన మోడీ
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు ప్రవేశ పెట్టుకున్నామని తెలిపారు. మనకు యాదాద్రి లక్ష్మి నరసింహ, భద్రాద్రి రామయ్య ఆశీస్సులు ఉన్నాయన్నారు. మనం ప్రటించిన గ్యారంటీలలో ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పథకం, 200 యూనిట్లకు ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. ఉచిత కరెంటు అంటే హేళన చేస్తూ.. సంపద పెంచుతాం.. ప్రజలకు పెంచుతాం అంటున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే పనికి ఇక్కడి నుండే పునాది వేసామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒక బూటకం, సింగరేణిని నిర్వీర్యం చేశారు.. వాటిని బాగు చేసే పని కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించుకోవాలని ఆయన కోరారు.