తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు. తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై మోడీ సాక్షిగా… రేవంత్ దాడి అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్” కు.. “Golden తెలంగాణ మోడల్”తో పోలికెక్కడిది..…
మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు. మహిళా దినోత్సవం అనేది ఒక్క రోజు కాదు ప్రతిరోజు మహిళలని గౌరవించాలన్నారు. మహిళలు అన్నిరంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మిటన్ ప్లేయర్ సైనా…
సీఎం రేవంత్ వంద రోజుల పాలన చూసి కాంగ్రెస్ కు ఓటెయ్యండి అంటున్నారని, కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఏమైందని ప్రశ్నించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాషాయ పేపర్ పై మోడీ కి లవ్ లెటర్ రాసిండన్నారు. కాంగ్రెస్ ను కూడా మోసం చేసిండని, రాహుల్ అధానిని తిడితే సీఎం రేవంత్ అలై బలై తీసుకున్నారన్నారు. మళ్లీ మోడీయే…
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం 'రైతు నేస్తం'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు.
మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం.. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్టు సమాచారం ఇచ్చాడు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు.. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారు.. పథకాల అమలు అర్ధం కాకపోతే ఆర్టీఐ ద్వారా వివరాలు తెలుసుకోవాలి అని సూచించారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై కావాలనే బురద జల్లుతున్నారు అని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి వెల్లడించారు.
నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ ఎంక్వైరీ వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి- ప్రధాని మోడీని బడా భాయ్ అని చెప్పి గుజరాత్ మోడల్ తెలంగాణలో అమలు చేస్తా అంటున్నాడు అని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.