నేడు 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. విశాఖ- భువనేశ్వర్, విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభం. కొత్తవలస- కోరాపుట్ సెక్షన్లు, కోరాపుట్-రాయగడ లైన్లలో డబ్లింగ్ పనులు ప్రారంభం. విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో పూర్తైన భాగాలు ప్రారంభం.
నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన. కనకదుర్గ వారధి దగ్గర ఇరిగేషన్ రిటైనింగ్ వాల్.. రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రారంభోత్సవం. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్దిదారులకు అందజేత.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.79,000 లుగా ఉంది.
నేడు జనసేన పార్టీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. మంగళగిరిలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న పులపర్తి రామాంజనేయులు.
నేడు ఏలూరులో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన. ఏలూరు రైల్వేస్టేషన్‌లో గూడ్స్ షెడ్ అధునీకరణ పనులు. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ.
నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ. మహిళలకు వడ్డీలేని రుణాలు, రూ.2,500 ఆర్థిక సహాయంపై ప్రకటన. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు. కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు. 11 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదంపై చర్చ.
నేడు తెలంగాణకు కేందర హోం శాఖ మంత్రి అమిత్ షా. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయ్యాక మొదటి టూర్. మధ్యాహ్నం 1.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న అమిత్ షా.
నేడు ఏపీలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. 13 ఏళ్లు పూర్తి చేసుకొని 14వ ఏట అడుగుపెట్టిన వైసీపీ.
నేడు నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ప్రారంభం. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం జగన్. రూ.390 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె హర్బర్.