తెలంగాణ కేబినెట్ మంగళవారం (మార్చి 11) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రేపటి క్యాబినెట్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, 2500 రూపాయల ఆర్థిక సహాయం పై ప్రకటన.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి.. 2008 డీఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు.. 11 కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం పై చర్చించనున్నారు.
Read Also: TDP – Janasena – BJP Alliance: ముగిసిన షెకావత్-చంద్రబాబు-పవన్ భేటీ.. ఎనిమిదిన్నర గంటల పాటు చర్చలు
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. రూ.22,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు.
Read Also: Vasantha Krishna Prasad: మైలవరంలో ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు..