టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవే.. !
నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పలు నిర్ణయాలను ( key decisions ) టీటీడీ ( TTD ) తీసుకుంది. ఈ సందర్భంగా స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోగా.. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మాణానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు చేసింది. యాత్రి సముదాయంలో లిఫ్ట్ లు ఏర్పాటుకు 1.88 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే, బాలాజీ నగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక, 14 కోట్ల రూపాయలతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ పనులకు శ్రీకారం చుట్టింది.
సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘డీప్‌ఫేక్ వీడియోస్’ సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎందరో సెలెబ్రిటీలు డీప్‌ఫేక్ వీడియోస్ బారిన పడ్డారు. కృత్రిమ మేధను ఉపయోగించి సృష్టిస్తున్న ఈ వీడియోలపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి వీడియోలు, ఫొటోల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టినా.. ఎలాంటి ప్రయోజనం లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
డయాబెటిస్ ఔషధానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నట్లు వీడియోలో ఉంది. మధుమేహ బాధితులు ఔషధాన్ని కొనుగోలు చేయాలంటూ సీఎం ప్రోత్సహిస్తున్నట్లు కేటుగాళ్లు 41 సెకన్ల నిడివి గల వీడియోను సృష్టించారు. ఓ న్యూస్ ఛానల్ క్లిప్‌లో యోగి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఫిబ్రవరి 26న ఈ వీడియో అప్‌లోడ్ చేయబడింది. హజ్రత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా వీడియో సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.
ఏపీలో 1134 కి. మీ రోడ్లను వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని.. పాల్గొన్న పురంధేశ్వరి..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1134 కీలో మీటర్లు నేషనల్ హైవేలను 29,395 కోట్ల రూపాయలతో నిర్మించగా.. వాటిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో శంకుస్థాపన రోడ్లు వేయడం వల్లన అర్ధిక అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నది ఆయన కల అని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ ప్రధాని స్థానంలో రాక ముందు ప్రపంచంలోనే భారత్ అభివృద్ధిలో 11స్ధానంలో ఉండేది అని పురంధేశ్వరి వెల్లడించింది.
కాంగ్రెస్‌లో కొనసాగుతన్న చేరికల పర్వం..
హైదరాబాద్ ఉప్పల్ నియోజకర్గంలోని పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ బీజేఆర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల సభకు ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మంధముల పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ తో కలిసి జమ్మిగద్ద ప్రాంతానికి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రియురాలిని పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్.. ఫొటోస్ వైరల్!
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి కెమిల్లా హారిస్‌ను మిల్లర్ ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న మిల్లర్, కెమిల్లాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కెమిల్లా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను కెమిల్లా షేర్ చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేప్ టౌన్ వేదికగా జరిగిన డేవిడ్ మిల్లర్, కెమిల్లా హారిస్‌ల వివాహానికి పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ 2023 ఆగస్ట్‌లో జరిగింది. కెమిల్లా ఓ బిజినెస్ రన్ చేస్తున్నారు. మిల్లర్, కెమిల్లా వివాహానికి కొద్ది మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. త్వరలో మిల్లర్ ఐపీఎల్ 2024 కోసం భారత్ రానున్నాడు.
మరోసారి జగన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికే.. ముద్రగడ లేఖ..
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తారీఖున వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ పద్మనాభం.. ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను.. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్‌ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను.. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్‌తో చేయించాలని ఆశతో ఉన్నాను అంటూ ముద్రగడ పద్మనాభం వెల్లడించారు.
కొన్ని మీడియా సంస్థలు కావాలని విమర్శనాత్మకంగా చిత్రీకరించాయి…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ కష్టాలు ఏర్పడుతున్నాయని కొన్ని మీడియా సంస్థలలో రావడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని విమర్శనాత్మకంగా చిత్రీకరించాయని ఆయన మండిపడ్డారు. నిన్న జగిత్యాలలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం గురించి రెవెన్యూ అధికారులు విద్యుత్ శాఖకు తెలుపకపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, ప్రతి రెండవ శనివారం రోజున చేపట్టే మరమ్మత్తులకై అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారన్నారు. అధికారులు సమన్వయ లోపంతో ఏర్పడ్డ అంతరాయాన్ని విద్యుత్ కొరతగా సృష్టించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎదురవుతున్న కరెంటు కష్టాలని కొన్ని టీవీ పత్రికల్లో రావడం ఆశ్చర్యకరమన్నారు జీవన్ రెడ్డి. గత సంవత్సరంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన రెండు నెలల్లో ఎక్కువ మొత్తంలో వినియోగదారులు విద్యుత్తువినియోగించుకున్నారని, గత ప్రభుత్వ పాలన కన్నా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంతోపాటు గృహ అవసరాలకు ఇలాంటి అంతరాయాలు లేకుండా మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో వినియోగదారులకు అండగా నిలవడంతో కావాలనే టీఆర్ఎస్ నాయకులు అనుబంధిత మీడియా సంస్థ కావాలనే విమర్శలు చేస్తున్నాయని లేఖలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
పవన్ కాకినాడ ఎంపీగా కాదు.. నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేయాలి..
రాబోయే ఎన్నికల్లో జనేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా కాదు.. నా మీద కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కడ పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఇష్టం ఉండదు.. పై నుంచి ఆదేశాలు రావాలి.. అప్పుడే ఆయన పోటీ చేసేది అని పేర్కొన్నారు. ఇక, కాకినాడలో పవన్ కళ్యాణ్ పార్టీకి గుండు సున్నా తప్పదన్నారు. గాజు గ్లాస్ అయిన నా మీద పోటీ పెట్టాలని గతంలోనే చెప్పాను అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరటం దారుణం అని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
వరంగల్ మీదుగా మరో వందేభారత్
వరంగల్ మీదుగా మరో వందేభారత్ ప్రారంభం కానుంది. వరంగల్ మీదుగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం నుంచి నడవనుంది. దీనిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా సికింద్రాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల వరకు విశాఖపట్నంకు వందే భారత్ ట్రైన్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాగా.. ఇది తెలంగాణ నుండి నాల్గవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. మార్చి 12 న సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ఫ్లాగ్ చేయడంతో తమ కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయి.
సైలెంటుగా కొత్త సినిమా రిలీజ్ కి రెడీ చేసిన హనుమాన్ నిర్మాత..
ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. నిరంజన్ రెడ్డి ఈ ప్రొడక్షన్ ద్వారా మొదటి ప్రయత్నంలోనే పాన్ ఇండియా మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రానుంది..
ఈ సినిమాను మరింత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి ప్రొడక్షన్ నెంబర్ 2గామరో స్టార్ హీరో సినిమా రావొచ్చని అందరూ భావించారు. అయితే తన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుంచి అవుట్ అండ్ అవుట్ క్రేజీ కామెడీ కథాంశంతో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. బలగం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి, ఇస్మార్ట్ పోరి నభా నటేష్ జోడీగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాను సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది.. త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం..
జగన్ ప్రజల చుట్టూ తిరుగుతుంటే.. పొత్తుల కోసం చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతున్నారు..
మెదరమెట్లల్లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది అని రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మా కుటుంబం 60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉందన్నారు. ఎన్నో సమావేశాలు, సభలు చూసాను.. కానీ సిద్ధం సభకు మా నేతలు ఆడిగినన్ని వాహనాలు ఇవ్వలేకపోయాం.. చాలా మందికి నిరాశ కలిగింది.. నా జీవితంలో మొదటి సారి ఇలాంటి స్పందనను చూస్తున్నాను.. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సిద్ధం సభ రికార్డును సృష్టించింది.. జగన్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు జగన్ కు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో తరలి వచ్చారు.. టీడీపీకి చెందిన వారు కూడా సభకు వచ్చారు.. ఈ మీటింగ్ కు వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబుకు గ్యాస్టిక్ ట్రబుల్ వచ్చింది అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చురకలు అంటించారు.
వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదు
పదవిలో ఉన్నప్పుడు సన్మానం చేయడం సహజమని, నేను పదవి విరమణ చేసి సంవత్సరం దాటింది అయినా నాకు సన్మానం చేశారని, వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇవాళ ఆయన కు ఖమ్మంలో జిల్లాలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు నాకు అవినాభావ సంబంధం ఉందని, నా చిన్ననాటి స్నేహితులు ఇక్కడ ఉన్నారన్నారు. నేను గతంలో ఖమ్మం వచ్చి మూడు భవనాలకు శంఖుస్థాపన చేసి వెళ్ళానని ఆయన తెలిపారు. ఆ పని ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. భారత దేశంలో న్యాయ వ్యవస్థకు ప్రాదాన్యత లేదని ఆ రోజు అర్ధం అయిందని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు న్యాయమూర్థులను తయారు చేసానన్నారు. ఖమ్మం కు ఉద్యమాల జిల్లా,ఉద్యమాల ఖిల్లా,పోరాటాల గడ్డ,పోరాటాల బావుటా అనే పేర్లు ఉన్నాయని, పుచ్చలపల్లి గారు రాసిన పుస్తకాలు చదివితే ఇక్కడ కలియ తిరిగినట్లే ఉంటుందన్నారు.