ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.ఆర్.ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు…
Dil Raju Family invites CM Revanth Reddy to Asish Reddy Marriage: ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి. ఆయన ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో ‘సెల్ఫిష్’ అనే మూవీ ఒకటి చేస్తున్నాడు. ఒకరకంగా ఆయన గురించి చెప్పాలంటే హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా అశిష్ రెడ్డి త్వరలో ఒక ఇంటి…
రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్రెడ్డి..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్ వెళ్లనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలో ఆయన పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి వెళ్లనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో పది మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది.
రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే…
ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ స్పీచ్ ను కేబినెట్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అభయ హస్తం ఆరు గ్యారెంటీల్లో అమల్లో భాగంగా…
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ సూర్యాపేట జిల్లా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభత్వానికి ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారన్నారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్.. కేసీఆర్ పై ఎదురు దాడికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్ట్ లను అప్పగించారని, కేసీఆర్ మాట్లాడక ముందే…