నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలను ఆరంభిస్తుంది. గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం 500రూపాయలకే ఇవ్వనున్నారు.
టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే.. తొలి జాబితాలోనే టిక్కెట్ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల…
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ, విద్యుత్ కార్మికులతో పోటీ పడి సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటున్నామని, ఖనిజ నిక్షేపాలు కేంద్రం అమ్ముకుంటుంటే గత ప్రభుత్వం నిలువరించ లేకపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 72 వేల కోట్ల అప్పులతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభమై 7 లక్షల…
Mallu Ravi: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు.. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అవాకులు, చెవాకులు మాట్లాడారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిన విషయం మీకు తెలిసిందే. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరణలు కోరుతూ, గవర్నర్ మొదట ఆమోదించలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో…
ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి…
మేడారంలో సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మంత్రులతో కలిసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు ముఖ్యమంత్రి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ 75 రోజుల పాలన గురించి వివరించారు.
Kishan Reddy: రామగుండంలో ఎరువుల పరిశ్రమను మోడి ప్రారంభించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాగజ్ నగర్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల కార్యాచరణను మొదలు పెట్టిందన్నారు.