విశాఖలో న్యాయ సాధన సభ నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పెత్తందార్లు వచ్చి తెలుగు గడ్డ మీద ఇటుక ముక్క కూడా తీసుకుని వెళ్ళలేరని విమర్శించారు. విశాఖ ఉక్కును ఎవరు టచ్ చేయలేరని అన్నారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టిన వాళ్ళే వారసులు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు.. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి రాష్ట్రానికి దాపురించింది.. తెలంగాణ, ఆంధ్రలో ఢిల్లీ వెళ్లి వంగి దండాలు పెట్టే వాళ్ళే కానీ.. ప్రశ్నించే నాయకత్వం లేకుండా పోయిందని మండిపడ్డారు.
Telangana: హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారీగా కలిసి వుండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ బలం బలగం బాబు, జగన్, పవన్ అని పేర్కొన్నారు. ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు పక్కన ఉంటే భజనపరులు లాగా ఢిల్లీలో మోదీ పక్కన జగన్, బాబు నిలబడుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రకు కావలిసినది వెన్నెముక లేని నాయకత్వం కాదు నిటారుగా మాట్లాడే వాళ్ళు కావాలన్నారు. జగన్, బాబు, పవన్ కు మోడీని ప్రశ్నించే శక్తి లేదని విమర్శించారు. పాలించే నాయకులు కాదు.. ప్రశ్నించే గొంతులు కావాలని తెలిపారు. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి విశాఖ ఉక్కును షర్మిళ కాపాడుతుందని పేర్కొన్నారు.
MS Dhoni: అక్కడ భారీ సిక్స్ లతో రెచ్చిపోయిన ధోని..!
తెలంగాణలో ఒక పక్క మోడీ.. మరో పక్క కేడీ మీద మాట్లాడామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీని ఓడించాము.. KDని పడగొట్టామన్నారు. తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. అచ్చోసిన అంబోతులు తలపడుతుంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం ఎంత కష్టమో షర్మిళకు తెలుసన్నారు. అదానీ కోసం ప్రధాని విశాఖ ఉక్కును తెగ నమ్ముతుంటే ఇక్కడ నాయకత్వం మాట్లాడటం లేదనిన మండిపడ్డారు. బీజేపీ నీడ ఏనాడూ వైఎస్ అర్ మీద పడ లేదు.. అటువంటి మోడీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం మళ్లీ వస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.