నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన. నేడు మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో ప్రధాని మోడీ రోడ్ షో. మిర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి క్రాస్ వరకు ప్రధాని రోడ్ షో.
తిరుపతిలో కొనసాగుతున్న లోకల్, నాన్‌లోకల్‌వార్. తిరుపతి సీటుకు నేడు నగరంలో ఆత్మగౌరవ సభ. అభ్యర్థి ఆరిణి శ్రీనివాసులను మార్చే వరకు పోరాటం తప్పదంటున్న టీడీపీ, జనసేన నేతలు. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ నేతలు సైతం హాజరుకానున్నట్లు సమాచారం. గోబ్యాక్ ఆరిణి అంటూ నగరంలో వెలసిన ఫ్లెక్సీలు.
నేడు వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం. సీఎం జగన్ సమక్షంలో కుమారుడు గిరితో వైసీపీలోకి ముద్రగడ.
తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూల్స్ ఓపెన్. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్స్.
నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ. లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించిన కవిత. ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరిన కవిత.
యాదాద్రిలో నేడు 5వ రోజు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఉదయం శ్రీకృష్ణ అలంకారంలో దర్శనం ఇవ్వనున్న లక్ష్మీనరసింహుడు. నేటి రాత్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి పొన్న వాహన సేవ.
మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసు. నేడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌పై విచారణ. కౌంటర్ దాఖలు చేయాలని ప్రణీత్‌రావు లాయర్లకు ఆదేశం. నేడు విచారించనున్న నాంపల్లి కోర్టు.
నేడు డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్. ముంబైతో తలపడనున్న బెంగళూరు. ఎల్లుండి డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,110 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80 వేలుగా ఉంది.
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కన్హా శాంతివనంలో రెండోరోజు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం. హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
నేడు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.