Ramadan Iftar Feast: ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.
Read also: Massage Center: మసాజ్ సెంటర్ లో అడ్డంగా దొరికిపోయిన ఎస్‌ఐ..!
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో రంజాన్ తొలి శుక్రవారం కావడంతో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇఫ్తార్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయాలు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులను కోరారు.
Read also: PM Modi: తెలంగాణకు ప్రధాని మోడీ రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!
రంజాన్ ఉపవాస దీక్షలు (రంజాన్ 2024) మార్చి 12 నుండి ప్రారంభమయ్యాయి. ఒక నెలపాటు ఉపవాసం ఉండి అల్లాను ప్రార్థిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెలను రంజాన్ నెల అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మిక ప్రార్థనలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు. ఈ మాసంలో ఒక నెల మొత్తం ఉపవాసం ఉండడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే వారు ఆహారం, పానీయం మరియు శారీరక అవసరాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఖురాన్ పఠించాలి. ఇస్లాం యొక్క ఐదు సూత్రాలలో ఉపవాసం ఒకటి. స్వీయ-క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. కుటుంబం స్నేహితులతో కలిసి భోజనం చేస్తారు. ఏదైనా తప్పులు మరియు తప్పులు జరిగితే, వారు క్షమించమని అల్లాహ్‌ను ప్రార్థిస్తారు.
Odisha: బీజేపీ, బీజేడీ పొత్తు ఉందా..? లేదా..?