TDP నేత మన్నెం వెంకటరమణ కన్నుమూత టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే.. అమెరికాలోని న్యూ…
Tunnel Roads: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైతే రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు దర్శనమిస్తున్నాయి.
CM Revanth Reddy: మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్లో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబందు అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ…
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే? మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి… అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు తగ్గి..రూ. 57,350 వద్ద ఉండగా, అలాగే 24 క్యారెట్ల పసిడి ధర పై రూ. 10 తగ్గి.. రూ. 62,560 వద్ద ఉంది.. అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి..…
ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్ లో కోస్గి చేరుకోనున్న సీఎం…
1. నేడు విశాఖకు సీఎం జగన్. శ్రీశారదా పీఠం సందర్శన, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం జగన్. దాదాపు రెండు గంటలు శారదా పీఠంలో ఉండనున్న సీఎం జగన్. 2. నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్లో రానున్న పవన్. మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్. అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం. తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం. 3.…
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం(చౌటుప్పల్-అమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి, పలు…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కాగా.. తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా.. 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఇందుకోసం ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని చారిత్రక…