లోకల్ బాడి ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్ ను పలువరు ఐఏఎస్‌లు ఆశ్రయించారు. క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన అందులో ఉన్నారు.
పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు రాచకొండ కమిషనర్ అండగా నిలిచారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐ ఎల్ బినగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్యని కలిసి సమస్య వివరాలు ఆరా తీశారు.
పండగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది. దాదాపు 50-70శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన రోడ్ల నిర్మాణానికి రూ. 1377.66 కోట్లు మంజూరు చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
అలయ్ బలయ్పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి బాబా చనిపోవడానికి కారణం అయిన కేంద్రంలో మీరు భాగస్వామి.. అలయ్ బలయ్ కి రాలేనని నారాయణ ప్రకటించారు.
అలయ్ బలయ్పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి బాబా చనిపోవడానికి కారణం అయిన కేంద్రంలో మీరు భాగస్వామి.. అలయ్ బలయ్ కి రాలేనని నారాయణ ప్రకటించారు.
CM Revanth Reddy: వికారాబాద్ జిల్లా నిన్న సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాల తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్ నియోజకవర్గం సందడి వాతావరణం నెలకొంది.
ఇరాన్లో భారీ స్థాయిలో సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యంగా.. పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, అణుస్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. దీని వల్ల సమాచారం చోరీకి గురైందని…
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి చేరుకుని, అక్కడ జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డికి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతారు. సీఎం గా రేవంత్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించడం ఇది మొదటిసారి. ఆయన కొండారెడ్డిపల్లిలో రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించబడిన…