Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర.. ఇవాళ, రేపు బస అక్కడే..
- నేడు బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం..
- మూసీ ప్రక్షాళన చేయండి-పేదల ఇళ్లు కూల్చకండి అనే నినాదంతో బీజేపీ మూసీ నిద్ర..
- ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర నేటి సాయంత్రం నుంచి ప్రారంభించనున్నారు. ఇవాళ, రేపు అక్కడే బసచేయనున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి..! అనే నినాదంతో మూసి పరివాహక ప్రాంతంలో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమాన్ని చేయనుంది. మూసీ ప్రక్షాళన – సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి, మూసి సుందరికరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని బీజేపీ హెచ్చరిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాలలో నివాసముంటున్న బాధితుల ఇండ్లల్లో వారితో పాటు మమేకమై.. వారి ఇండ్లలోనే నిద్రించి వారికి అండగా బీజేపీ ఉందని భరోసానిచ్చేందుకే బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. త్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు, మూసి పరివాహక ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు మూసి నిద్ర చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే ఉండునున్నారు. రాత్రి భోజనం, ఉదయం అల్పహారం కూడా అక్కడే చేయనున్నారు బీజేపీ నాయకులు.
Read also: Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..
Also Read
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
సియోల్ తరహాలో హైదరాబాద్‌లోని మూసీని పునరుద్ధరిస్తామని తెలంగాణకు చెందిన రేవంత్ సర్కార్ చెబుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈనెల ఎనిమిదో తేదీన నల్గొండ జిల్లాలోని మూసీ నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్రకు దిగారు. మూసీ పునరుద్ధరణను అడ్డుకుంటే బుల్ డోజర్లతో తొక్కేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అయితే.. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసి ప్రాంత పేదలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు, వారికి అండగా నిలుస్తామని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమని చేప్పారు. ఈ క్రమంలోనే.. నేడు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర చేపట్టింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలను బీజేపీ నేతలు సందర్శించిన విషయం తెలిసిందే..
Fire Accident: పుప్పాల్ గూడ లో భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్..
తాజావార్తలు
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!