CM Revanth Reddy: నేడు సొంతూరు కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్నున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండా రెడ్డి పల్లిలో దసరా పండుగ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి జరుపుకోనున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాత్రి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి కార్యదర్శులు విశ్వనాథ్, విశ్వనాథం లతోపాటు నాలుగు జిల్లాల సంబంధించిన మంత్రులు, ఎంపీలు,…
ప్రపంచవ్యాప్తంగా లైంగిక దాడులకు బలవుతున్న 37 కోట్ల మంది బాలికలు.. ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మందికి పైగా బాలికలు మరియు మహిళలు తమ చిన్నతనంలో అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైనట్లు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. 18 ఏళ్ల లోపు ప్రతీ 8 మందిలో ఒక బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. పిల్లలపై లైంగిక హింసపై మొట్టమొదటిసారిగా ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో రిపోర్ట్ వెలుబడింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న బాలికలకు ఈ వేధింపులు…
డీఎస్పీ (DSP)గా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది.. ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాల స్కూల్స్ బాగుకోసం కోట్ల రూపాయాలు కేటాయించామన్నారు. ఇప్పటికీ వున్న ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షన్సియల్ స్కూల్స్ కొనసాగిస్తామన్నారు. ఏవి కూడా ముసేసిది లేదన్నారు. అన్నింటికీ శాశ్వత భవనాలు కల్పిస్తామన్నారు. అడ్డంకులు సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఉడుత ఊపులకు ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎవరు…
షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కోందుర్గులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… 28 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమి పూజ చేశామని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ నిర్మాణం, ప్రత్యేకంగా…
రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసి.. శిలా ఫలకం ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దసరా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని.. మంచి పంటలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రోజునే మేము వాగ్దానం చేసినం..…
Minister Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు.
ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.' విద్యార్థుల ముందు, గురువుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు @TelanganaCMO. గడిచిన పది నెలలలో కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..?. మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమా లేక పార్టీ కార్యక్రమా అని ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారు.
హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్‌ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ…