హరీష్.. కేటీఆర్.. ఈటెలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మూడు నెలలు.. పేదలు కాళీ చేసిన ఇండ్లలో ఉండాలని.. కిరాయి తానే కడతానన్నారు. మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయాలన్నారు.
మూసి పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారన్నారు.
ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్సుకు చట్ట బద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా పై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది.
KTR Viral Tweet: రాష్ట్రానికి పైసా లేదు, లాభం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని..
ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్ రావు మండిపడ్డారు.…
బ్యాంకులకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్ కు 28.30 లక్షల జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కు సంబంధించిన కొన్ని షరతులను పాటించనందుకు కంపెనీకి జరిమానా విధించబడింది. ఎస్ జీ ఫిన్సర్వ్ని ముందుగా ముంగిపా సెక్యూరిటీస్ అని పిలిచేవారు. ఆర్బిఐ ఎప్పటికప్పుడు ఆర్థిక సంస్థల నిబంధనలను పాటించని అంశాలపై నిఘా ఉంచుతుంది. కంపెనీలు, బ్యాంకులు నిఘాలో ఉండేలా జరిమానాలు వంటి చర్యలను కూడా తీసుకుంటుంది. 2022-23 ఆర్థిక…
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014 లో బీజేపీ సభ్యత్వ సేకరణ తర్వాత 2024 లో చేస్తున్నామన్నారు.
మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో నూతనంగా ఏర్పాటు అవుతున్న ఫాక్స్ కాన్ కంపెనీ పనులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.