CM Revanth Reddy: గుజరాత్ గులాంలుగా మారారు.. శిండే.. అజిత్ పవార్ పై సీఎం కీలక వ్యాఖ్యలు
- మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ శిండే… అజిత్ పవార్ కాలరాశారని ఆగ్రహం..
- శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని కీలక వ్యాఖ్యలు..
- ప్రవీణ్ ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న… హైదరాబాద్ లో మరో అన్నగా నేను ఉంటా ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర చంద్రాపూర్ నియోజవర్గం గుగ్గూస్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని క్లారిటీ ఇచ్చారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ శిండే… అజిత్ పవార్ కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ప్రవీణ్ ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు… హైదరాబాద్ లో మరో అన్నగా నేను ఉంటా అన్నారు. ఇక రేపు ఇక రెండోరోజు ఆదివారం ఉదయం నాగ్‌పూర్ నుంచి నాందేడ్ చేరుకుంటారు. నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్ కు తిరిగి రానున్నట్లు తెలుస్తుంది.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
Read also: Health Benefits: సన్నగా ఉన్నానని బాధపడుతున్నారా? ఇవి తినండి చాలు..
ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపధ్యంలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు.
తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్డీయే నుంచి కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో సందడి చేశారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ముంబైలో బీజేపీ నేతలు తమ మిత్రపక్షం ఏపీ సీఎం చంద్రబాబు బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ప్రచారానికి ఆహ్వానించారు. ఈనేపథ్యంలో నేడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేపట్టారు.
Ponnam Prabhakar: గీతా కార్మికులకు త్వరలో మోపెడులు.. గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం ప్రభాకర్
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!