రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. నిన్న ( మంగళవారం ) ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోంది అని ఆయన అన్నారు.
బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తు.. ఊరుకునే ప్రసక్తి లేదని ఆర్. కృష్ణయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెంటనే బీసీలకు మరిన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీసీలు.. బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.
కూనంనేని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకేం నష్టం లేదు.. నష్టపోయేది కేసీఆరే.. బీజేపీతో కేసీఆర్‌కి సఖ్యత వచ్చింది.. మునుగోడులో బీజేపీ ప్రమాదమని చెప్పిన కేసీఆర్‌కి.. ఇప్పుడు బీజేపీతో మిత్రుత్వం ఎక్కడ కుదిరింది? బీజేపీకి దగ్గరైతే.. కనీస మిత్ర ధర్మం ఉండాలి కదా? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి అని అడిగారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆయనపై కేసు పెట్టాలని కోరుతూ వందలాదిమంది కాప్రా సర్కిల్ కార్మికులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తనకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ (మంగళవారం) క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యాడు. ఈ క్రమంలో వారితో మాట్లాడుతూ.. ఒక్కసారిగా భోరున విలపించారు. ఆతర్వాత కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని వెక్కివెక్కి ఏడ్చారు.
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడగడం విడ్డూరంగా ఉంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.