Etela Rajender: బీజేపీలోకి వెళతారనే భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర ఏళ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజాస్వామిక పద్దతుల్లో బీజేపీ గెలిచిందని అన్నారు.
CM KCR: ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని చేపట్టింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు బీజేపీ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు దశల వారీగా నిరసనలు ఉంటాయన్నారు.
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్ రావు చెప్పుకొచ్చారు. మేం అందరం.. సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం.. కానీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అంటున్నారు. తాము శంకర్ నాయక్‌తో కలిసి తిరిగినా జనం ఓట్లు వేయరని వారు పేర్కొన్నారు. శంకర్ నాయక్‌ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన తప్పకుండా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మెల్సీ అనుచరులు చెప్పారు.
కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తాం అంటున్నారు.. ధరణి తీసేస్తే రైతుల అధికారం పోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ధరణి ఉంటే మీ భూమిని సీఎం కూడా మార్చలేడు.. తీసేస్తే అధికారుల దగ్గర పోతుంది.. ధరణి పోతే పెద్ద పాము మింగినట్టు అయితదని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ కి 10 ఏళ్లు అధికారం ఇచ్చాము ఇంకా చాలు.. ప్రజల కష్టాలు పోవాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి అని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఈ దుష్టంతాలను బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి అని ఆయన తెలిపారు.