తెలంగాణలో రైతుల కళ్లలో సీఎం కేసీఆర్ సంతోషం చూస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు సంపూర్ణం అయిందని ఆయన పేర్కొన్నారు. 11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయని తెలిపారు.
మెదక్ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కల అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారు.. కేసీఆర్ జిల్లా చేసి చూపించారు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణం.. మీరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండించే పనిలో బిజీగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను పోటీ చేయాలని ఎవరు కోరలేదు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు అలా చెప్పడం సిగ్గు చేటు అంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గజ్వేల్ లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.
సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా జిల్లాకు చేరుకున్న కేసీఆర్ ముందుగా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు.
R. Krishnaiah: బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా అంటూ బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కామెంట్స్ సంచలనంగా మారాయి. ఖమ్మం అంటే విప్లవమని, అనుకరణ జిల్లా కాదు ఆదర్శవంతమైన జిల్లా అని అన్నారు. స్వతంత్రభావాలు గల జిల్లా ఖమ్మం జిల్లా అని తెలిపారు.
Jupalli: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు.
Telangana Cabinet: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా, 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
CM KCR: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్‌లో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయం, పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు సాయంత్రం భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.