ఒక వైపు బీసీలకు 50 శాతం టికెట్లు పెంచాలని బీసీ సంఘాలు, బీసీ నేతలు డిమాండ్ చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ నిన్న (మంగళవారం) ప్రకటించిన 115 సీట్లలో బీసీలకు కేవలం 21 సీట్లు మాత్రమే కేటాయించింది. గతంలో ఇచ్చిన సీట్ల కంటే రెండు స్థానాలను తగ్గించి 21 మంది అభ్యర్థులకే ఎమ్మెల్యే సీట్లను కేసీఆర్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రకటించిన తొలి జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: German Minister: యూపీఐ పనితీరు చూసి ఆశ్చర్యపోయిన జర్మనీ మంత్రి
బీఆర్ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపులో పెంచేది పోయి తగ్గించి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తే బీసీలు ఏమాత్రం సహించరని జనాభాను అత్యధిక శాతం కలిగిన బీసీలు కేవలం 10 శాతం సీట్లు కేటాయించి అవమానపరచారని.. కేవలం 10 శాతం జనాభా కలిగిన అగ్రకులాలకు 60 శాతం సీట్లు కేటాయించి.. బీసీల ఆగ్రహానికి గురవద్దని హెచ్చరించారు. ఓట్లు బీసీలవి జనాభా బీసీలది.. చారిత్రాత్మక అన్యాయం జరుగుతుందని గతంలో కేటాయించిన కామారెడ్డి, హుజురాబాద్ సీట్లను కూడా తిరిగి బీసీలకు కేటాయించకుండా.. బీసీల పట్ల మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీఆర్ఎస్ పార్టీ ఇకనైనా బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Read Also: Endowment Lands: దేవాదాయ భూములపై చట్ట సవరణ.. ఇక, ఆ భూములు స్వాధీనం..
బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తు.. ఊరుకునే ప్రసక్తి లేదని ఆర్. కృష్ణయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెంటనే బీసీలకు మరిన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీసీలు.. బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.