KCR అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే KCR మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే రైతులకు ఎలా సరిపోతుంది? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడగళ్ల వాన తో రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.