Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Indrakiran Reddy Challenges Maheshwar Reddy: మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాజాగా మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టమని సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణల్ని ఆధారాలతో సహా నిరూపిస్తే.. చట్టప్రకారం తాను ఏ శిక్షనైనా ఎదుర్కోవడానికి సిద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్ రెడ్డి పనైపోయిందని.. రేపోమాపో పార్టీ మారడం ఖాయమని అన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు.. మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారని, ఆరోపణలపై రుజువులు చూపాలని కోరారని చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే.. ఆ అంశంపై మహేశ్వర్ రెడ్డి గానీ, ఆ పార్టీ కార్యకర్తలు గానీ స్పందించలేదన్నారు. కానీ.. మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తే మాత్రం.. కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ స్పందించిందని, కానీ కాంగ్రెస్ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉందని పేర్కొన్నారు.
Vemula Prashanth Reddy: ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకిరణ్ మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలందరూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ప్రజల గురించి గొప్పగా ఆలోచించే వ్యక్తి మనకు సీఎంగా ఉండటం అందరి అదృష్టమని చెప్పారు. కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి.. మరోసారి పార్టీకి అఖండ విజయం అందించాలని కోరారు. గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో వరిసాగు రెట్టింపు అయ్యిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ప్రతినెలా పెన్షన్‌తో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి కానుకలను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. రైతులు, సామాన్య ప్రజల ఆదాయాన్ని పెంచడం కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తుంటే.. మోడీ ప్రభుత్వం మాత్రం అన్ని వస్తువుల ధరల్ని పెంచుతూ సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరల్ని పెంచుతోందని.. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..