Vemula Prashanth Reddy Fires On PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మోడీ మాఫీ చేశారని ఆరోపించారు. ఎల్ఐసీలో ఉన్న పేదల పైసల్ని అదానికి దోచిపెట్టారని పేర్కొన్నారు. మోడీ అవినీతిని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే.. ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నారని అన్నారు. రేపు తన మీద కూడా కేసులు పెడ్తారని, అయినా తాను భయపడనని తెగేసి చెప్పారు. మోడీ అవినీతిని ప్రశ్నించినందుకే.. రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి డిస్‌క్వాలిఫై చేశారన్నారు. కాంగ్రెస్ సన్నాసులు అది మాట్లాడక.. తమ మీద ఒర్లుతున్నారని దుయ్యబట్టారు. పెద్దాయన డీఎస్‌కు జాతిరత్నాల్లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారని.. ఆయన పరిస్థితి ఏ తండ్రికీ రావొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. అర్వింద్‌కు పసుపు రైతుల ఉసురు తగిలిందని, ఇంకా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి నెత్తా, కత్తా? ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడితే.. సహించేది లేదని హెచ్చరించారు.
Mekapati Chandrasekhar Reddy: రాజకీయాలంటే విరక్తి కలుగుతోంది
ప్రధాని మోడీ పాలనలో రూపాయి విలువ మరింతగా పతనమైందని.. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ.1200కు పెరిగిందని.. పప్పు, అప్పుల ధరలు ఆకాశాన్నంటాయని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. డీజిల్ ధర రూ. 40 నుంచి రూ. 100 పెరగడం వల్ల.. ట్రాన్స్‌పోర్ట్ ధర పెరిగి, నిత్యావసర సరుకుల మీద ప్రభావం చూపుతోందన్నారు. ఇలా ధరలు పెరగడం వల్ల సామాన్యుల పరిస్థితి భారంగా తయారైందని, దీనంతటికి ప్రధాని మోడీనే కారణమని అన్నారు. ఓవైపు తెలంగాణలో కేసీఆర్ పేద ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. మరోవైపు మోడీ ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తున్నారని చెప్పారు. బడా బాబుల కంపెనీలకు రుణాలు మాఫీ చేసి పేదల డబ్బులు కాచుకుంటున్నారని.. ఆ డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇలా ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారని వెల్లడించారు. మోడీ పేరుతో ఉన్న గుజరాత్‌కు చెందిన 6గురు అని అన్నందుకు.. రాహుల్ గాంధీని డిస్‌క్వాలిఫై చేశారన్నారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరగలేదని, ఎమర్జెన్సీ కంటే చాలా అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నాయన్నారు.
Harassment : గదికి రమ్మన్నాడు.. బట్టలు విప్పమన్నాడు.. కీచక టీచర్ దారుణం