కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్‌నర్ అంటూ అసదుద్దీన్ గురించి రేవంత్ మాట్లాడారు.
తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లి గ్రామంలో పాదయాత్రలో లేఖను సీఎల్పీ నేత విడుదల చేశారు.
ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని, లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కడియం శ్రీహరి పాల్గొన్నారు.