విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దసరా పండగ నుంచి విశాఖ నుంచే పరిపాలన చేయాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. దీంతో విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి లాంటి వాటి కోసం త్రీమెన్ కమిటీని సీఎస్ జవహార్ రెడ్డి నియమించారు.
Posani Krishna Murali: ఏపీకి సినీ పరిశ్రమ రావటంపై రాష్ట్ర ఫిల్మ్, టీవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశాడు. నేడు నంది అవార్డుల గురించి జరిగిన సమావేశంలో పోసాని.. కీలక విషయాలను చెప్పుకొచ్చాడు.
Bandla Ganesh: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కు బండ్ల ఎంత పెద్ద ఫ్యాన్.. కాదు కాదు ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక ఆయన గురించిఎవరైనా తప్పుగా మాట్లాడితే బండ్ల గణేష్ తనదైన రీతిలో ఇచ్చిపడేస్తాడు.
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు.
సీఎం వైఎస్ జగన్ ని అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ విద్యార్థుల బృందం కలిసింది. అమెరికా పర్యటన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. త
ఏపీకి తాను ఎందుకు కావాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వివరాలు విని నివ్వెరపోయాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అరాచక ఆంధ్ర ప్రదేశ్, అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చినందుకు మళ్లీ రావాలా..? అని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకం ప్రారంభం కాకినాడ జిల్లా లో జరుగనుంది. అయితే, తాజాగా సామర్లకోటలో ఈటీసీ లే అవుట్‌లో పేదలకు నిర్మించిన గృహాలను సామూహికంగా ప్రారంభించేందుకు, పైలాన్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబరు 12వ తారీఖున వెళ్లనున్నారు.
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపీలో ఏమీ ఉండదు అని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఏపీలో పూర్తి స్ధాయి అవకాశాలు కల్పిస్తున్నారు.. డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీకి కొత్తేం కాదు.. పవన్ కళ్యాణ్ కొత్తగా టీడీపీతో జతకట్టలేదు.. పవన్ టీడీపీతోనే ఉన్నారు అంటూ మంత్రి ఆరోపించారు.