ఏపీకి తాను ఎందుకు కావాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వివరాలు విని నివ్వెరపోయాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అరాచక ఆంధ్ర ప్రదేశ్, అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చినందుకు మళ్లీ రావాలా..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనతో అందరినీ అణగదొక్కేందుకు సీఎం జగన్ మళ్లీ రావాలా?.. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని నంబర్-1గా నిలిపినందుకు జగన్ కావాలా?.. లేక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినందుకు కావాలా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగారు.
Read Also: Anil Kumble: తాను అసలు రంగులోకి తిరిగివచ్చాడు.. కేఎల్ రాహుల్పై మాజీ లెజెండ్ ప్రశంసలు
నీటిపారుదల, వ్యవసాయ రంగాలని ముంచినందుకు సీఎం జగన్ కావాలా? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో రాష్ట్రంలో మరణ మృదంగం సృష్టిస్తున్నందుకు కావాలా?.. 87 శాతం ప్రజలకు జగన్ బటన్ నొక్కాడో లేదో తెలీదు కానీ, 100శాతం విద్యుత్ చార్జీలు, నిత్యావసరాలు పెంచేశారు.. మద్యం, ఇసుక మాఫియాలు, బడా కాంట్రాక్టర్లు, అదానీ, నత్వానీ లాంటి పేదలు జగన్ పక్కన ఉన్నారు అని ఆయన ఆరోపించారు. ఇలాంటి చేసిందుకు మళ్లీ సీఎం జగన్ కావాలా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో పాలన చేస్తుందని ఆయన అన్నారు. ఏపీలో ప్రజలు చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని చూస్తున్నారు అని సోమిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని మాజీమంత్రి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.