విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దసరా పండగ నుంచి విశాఖ నుంచే పరిపాలన చేయాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. దీంతో విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి లాంటి వాటి కోసం త్రీమెన్ కమిటీని సీఎస్ జవహార్ రెడ్డి నియమించారు. ఈ కమిటీలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ , సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులు ఉన్నారు.
Read Also: High Court: భార్యాభర్తలు ఎవరి ఫోన్ కాల్ రికార్డు చేసినా తప్పే.. హైకోర్టు కీలక నిర్ణయం
ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం జగన్ సర్కార్ పని చేస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి సమీక్షల కోసం విశాఖలో సీఎం బస చేయాల్సి ఉండటంతో పాటు ఆయనకు క్యాంప్ ఆఫీస్, బస ఏర్పాటుతో పాటు సీఎంవోలోని అధికారులకూ వసతి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వసతులను త్రీమెన్ కమిటీ క్షేత్రస్థాయిలో పరీశీలించనుంది.
Read Also: Rohit Sharma Muscles: చూసావా.. నా కండలు ఎలా ఉన్నాయో! రోహిత్ శర్మ వీడియో వైరల్
ఇక, ఆరు నూరైనా విశాఖ నుంచి పరిపాలన సాగించాలని సీఎం జగన్ అనుకుంటున్నారు. రాజధాని తరలింపుపై అనేక ఇబ్బందులు ఎదురౌతున్న ఆయన మాత్రం పట్టు వీడడం లేదు.. పాలన వికేంద్రీకరణ చేసి తీరాలని, మూడు రాజధానులు ఏర్పడాలని సీఎం జగన్ తెలిపారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని సీఎం జగన్ వెల్లడించారు. దసరా నుంచి విశాఖకు మకాం మార్చబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల రెండు మూడు సందర్భాల్లో మూడు రాజధానుల అంశాన్ని బహిరంగంగానే వెల్లడించారు. ఆ మధ్య ఢిల్లీలో పర్యటించినప్పుడు తాను త్వరలోనే విశాఖకు వెళ్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక, త్రీమెన్ కమిటీ వసతుల కల్పనపై సీఎస్ కు రిపోర్ట్ ఇవ్వనుంది. దీన్ని ద్వారా విశాఖ నుంచి పాలన కొనసాగించాలా వద్దా అనేది తెలుస్తుంది.