Bandla Ganesh: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. వీడియో రిలీజ్ చేసిన బండ్లన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandla Ganesh: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కు బండ్ల ఎంత పెద్ద ఫ్యాన్.. కాదు కాదు ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక ఆయన గురించిఎవరైనా తప్పుగా మాట్లాడితే బండ్ల గణేష్ తనదైన రీతిలో ఇచ్చిపడేస్తాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంత ఉత్కంఠగా మారాయో అందరు చూస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న సీఎం జగన్.. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మరోసారి మాట్లాడారు. పవన్ నివాసం హైదరాబాదులో ఉంటే, ఆయన ఇంట్లో ఇల్లాలు ప్రతి 3, 4 సంవత్సరాలకు మారిపోతూ ఉంటుంది. పవన్ భార్య ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్… తర్వాత ఎవరో ఆయనకే తెలియాలి అంటూ జగన్ ఘాటుగా మాట్లాడారు. ఇక ఈ వ్యాఖ్యలపై బండ్లన్న స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఇది అంటూ చెప్పుకొచ్చాడు. జగన్ అలా మాట్లాడం పద్దతి కాదని తెలిపాడు.
Esha Rebba : బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా కిర్రాక్ ఫోజులు..మాల్దీవుల్లో అందాలతో రచ్చ..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
” అందరికీ నమస్కారం.. నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన.. ఒకటే బాధ.. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే.. నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది.. చిరాకు తెప్పిస్తోంది.. నిన్న సీఎం జగన్ గారు నాకు ఇష్టుడైన పవన్ కల్యాణ్ గారి గురించి కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. ఇవి నాకెంతో బాధ కలిగించాయి.. నేను కొన్ని దశాబ్దాల పాటు పవన్ కల్యాణ్ వెంట తిరిగాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా నిజాయితీ పరుడు, నీతిమంతుడు. ఎవరు ఎలాంటి కష్టంలో నేనున్నా అంటూ ముందుండి సాయ పడే భోళా మనిషి. ఇప్పుడు అలాంటి మనిషి గురించి మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జీవితంలో అందరికీ అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అవి కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే.. అని నేను భావిస్తున్నాను. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడటం బాధగా ఉంది. మీకు విన్నవిస్తున్నాను.
Esha Rebba : బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా కిర్రాక్ ఫోజులు..మాల్దీవుల్లో అందాలతో రచ్చ..
పవన్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి.. దేశం కోసం బతికే మనిషి. ఆయన స్వార్థం కోసం కానీ, స్వలాభం కోసం ఏనాడు పని చేయలేదు. ఆయన హాయిగా షూటింగ్‌లు చేసుకుని సూపర్ స్టార్ హోదాతో హాయిగా బతకండని నేను తరచూ చెబుతుండే వాడిని. కానీ ఆయన జనాల కోసం ఏదో ఒకటి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అన్నిటినీ సహిస్తూ తలవంచుకుని జనం కోసం జీవిస్తున్నాడు. . రాత్రి, పగలు కష్టపడి.. సంపాదించిన డబ్బుని పార్టీకి, ప్రజలకు ధార పోస్తున్నాడు. ఆయనకు కులాభిమానం లేదు. అందరూ ఒక్కటే అని భావిస్తారు. ఒకవేళ ఆయనకే కులపిచ్చి ఉంటే నన్ను ఇంతలా ఆదరిస్తాడా? నన్నుఈ స్థాయికి తీసుకొస్తాడా? నేను ఈ రోజు అనుభవిస్తుందంతా కూడా పవన్ కల్యాణ్ పెట్టిన భిక్షే. ఆయన చాలా మంచి వ్యక్తి సార్. దయచేసి తెలిసీ తెలియకుండా ఆయన మీద అబాండాలు వేయకండి. నేను జన సేని మనిషిని, కార్యకర్తని ఏ మాత్రం కాదు. కేవలం ఆయనను ప్రేమించే వ్యక్తిని” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
@ganeshbandla pic.twitter.com/SIgrryzDUw
— devipriya (@sairaaj44) October 13, 2023
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!