ఏపీ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడబోతుంది. ఇవాళ ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.
దీక్ష చేసే ముందు ఎంత వరకు మన అర్హత ఉందో చూసుకోవాలి అని స్పీకర్ తమ్మనేని సీతారం అన్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర కాకపొతే హెలికాప్టర్ యాత్ర చేసుకోమనండి.. అది వాళ్ళ ఇష్టం.. తప్పు చేసి మోసం చేయాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఎన్నికలలో ప్రజలు ఊహించనంత తీర్పు ఇస్తారు.
కారల్ మార్క్స్, మహాత్మ గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని నేను అనను అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుని జగన్ వెళుతున్నారు అనేది మాత్రం నేను చెబుతానంటూ సజ్జల అన్నారు.
మహాత్మా గాంధీ మార్గంలోనే నడుస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు ఆర్పించారు. ఈ తరుణంలోనే.. మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా చెప్పారు.
ఇప్పుడు అంతా డిజిటైజ్ అయిపోయింది.. తప్పు చేయడం కుదరదు అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం.. ప్రభుత్వానికి ఉన్న మరి కొద్ది కాలంలో చేయగలిగినంత నేను మంత్రిగా చేస్తాను.. నిర్ణయాలు వెంట వెంటనే తీసుకుంటే ఉద్యోగులకు ఎలాంటి కష్టాలుండవు అని ఆయన అన్నారు.
నాలుగో విడత యాత్ర ఇవాళ్టి నుంచి అవనిగడ్డ వేదికగా ప్రారంభం అవుతుంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర నుంచి ముఖ్యమంత్రి జగన్ తో గౌతమ్ అదానీ సమావేశం కొనసాగుతుంది. విశాఖపట్నంలో డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
రేపు 'వైఎస్సార్ వాహన మిత్ర' నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర నిధులను విజయవాడలోని విద్యాధరపురంలో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాలో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి.
సీఎం వైఎస్ జగన్ ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. breaking news, latest news, telugu news, cm jagan, vahana mitra,