AP CM: సీఎం జగన్ ను కలిసిన అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వైఎస్ జగన్ ని అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ విద్యార్థుల బృందం కలిసింది. అమెరికా పర్యటన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. తమ అమెరికా పర్యటన అనుభవాలను సీఎం జగన్ తో ప్రభుత్వ స్కూల్ విద్యా్ర్థులు పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అమెరికా పర్యటన ద్వారా మీకు గ్లోబల్ ఫ్లాట్‌ఫాం మీద కొన్ని అనుభవాలు నేర్చుకున్నారు.. ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారుతాయి.. దీనికి విద్యే ఆధారం.. మనం జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
Read Also: Sarvam Shakthi Mayam: ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Also Read
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
కొలంబియా యూనివర్శిటీ లాంటి చోట్ల 21 కోర్సులు ఇచ్చే అన్ని ప్రఖ్యాత ప్రపంచ కాలేజీల్లో మీకు ఎక్కడ సీటు వచ్చినా ఉచితంగా చదివిస్తామని సీఎం జగన్ తెలిపారు. విదేశీ విద్యా దీవెన కార్యక్రమం కింద మీకు సీటు వస్తే చాలు రూ.1.2 కోట్ల వరకూ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది.. అలాంటి కాలేజీల్లో విద్యాభ్యాసం తర్వాత మీరు సీఈఓలుగా ఎదుగుతారు.. ప్రతిభ, నైపుణ్యాలు ఇలాంటి కాలేజీల ద్వారా మీకు అలవడతాయి.. అప్పుడు జీవితాలు మారుతాయి.. మీకు ఎలాంటి సబ్జెక్టుమీద శ్రద్ధ ఉంది, సంబంధిత ప్రపంచ స్థాయి కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, అందులో సీటు కావాలంటే ఏ రకంగా సన్నద్ధం కావాలన్న విషయాల్లో మీ ఆలోచనల్లో ఉండాలి.. జీఆర్‌ఈ, జీ మ్యాట్ లాంటి పరీక్షలు కూడా ప్రభుత్వ విద్యార్ధులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Urfi Javed: ఓరి నాయనో.. మరో కొత్త అవతారంలో బ్యూటీ.. నెటిజన్స్ ట్రోల్స్..
ప్రతి విద్యార్థినీ చేయి పట్టి నడిపించడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అని సీఎం జగన్ అన్నారు. విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడం అన్నది ఈ పిల్లల లక్ష్యం కావాలి.. అక్కడ సీటు సంపాదించి చదువులు పూర్తిచే సిన తర్వాత వారి జీవితాల్లో చక్కటి మార్పులు వస్తాయి.. టెన్త్ నుంచి ట్రిపుల్ ఐటీ సీటు రావడం అన్నది మీ డ్రీం.. అది నిజం అయ్యింది.. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ నుంచి కొలంబియా లాంటి యూనివర్శిటీ లాంటి గొప్ప యూనివర్శిటీల్లో సీటు సాధించడం అన్నది తదుపరి డ్రీం కావాలి.. ఇది సాకారమైతే మీ బతుకులు మారడమే కాదు, మీ కుటుంబాల బతుకులు మారడమే కాదు, రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంచినవారు అవుతారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు.
Read Also: Ambajipeta Marriage Band: ఎక్కడ దొరుకుతాయి సుహాస్ అన్నా.. నీకు ఇలాంటి కథలు
ఈ విద్యార్థులకు నిరంతరం చేయూత అందించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలి అని సీఎం జగన్ చెప్పారు. వారి ద్వారా మార్గనిర్దేశం చేయండి.. మన పాఠ్యప్రణాళికలో లేని 1800 సబ్జెక్టులను మన పాఠ్యప్రణాళికల్లోకి తీసుకు వస్తున్నాం.. ఎంఐటీ, హార్వర్డ్ లాంటి యూనివర్శిటీ నిపుణులచే తయారు చేయబడిన సబ్జెక్టులను ఇందులోకి తీసుకువస్తున్నాం.. ఎడెక్స్‌తో దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాం.. ఈ కోర్సులను చేసిన వారికి జాయింట్ సర్టిఫికెషన్ కూడా లభిస్తుంది.. బయట ప్రపంచం చూసినప్పుడు మరింతగా కష్ట పడాలన్న స్పూర్తి మీలో కలుగుతుంది.. ఈ పర్యటన మీకు మాత్రమే కాకుండా, మీ వల్ల ఇతరులకు కూడా స్ఫూర్తి కలిగిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!