మూలా నక్షత్రం కానున్న నేపథ్యంలో కనక దుర్గ అమ్మవారిని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం పర్యటన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం వుళేబీడు గ్రామ సమీపంలో వేరు శనగ పంట పొలాలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ఆలూరులో మంత్రి జయరాం ఉండి కూడా పంట పొలాలను పరిశీలించకపోవడం చాలా బాధాకరం అని ఆయన వ్యాఖ్యనించారు.
ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల అకౌంట్లోకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 25వేల లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
సీఎం జగన్ మాట్లాడుతూ.. డ్రై రేషన్ పంపిణీ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.. రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదు అని అధికారులకు సీఎం చెప్పారు.
కర్నూలు జిల్లాలో ఎల్లుండి ( ఈనెల 19వ తేదీన ) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు పథకం నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేయనున కార్యక్రమానికి వెళ్తున్నారు.
తెలుగు దేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సీఎం జగన్ కు లేఖ రాశారు. మూడో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలి.. రాష్ట్రంలో ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహణపై ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించాలంటూ ఆయన అన్నారు.
విశాఖ పట్నంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ అధ్యక్షతన VMRDAలో జరిగిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. సమీప భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం అని ఆయన పేర్కొన్నారు.