ఏపీలో కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాల్లో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. కొత్తపేట రెవెన్యూ డివిజనులో ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ. కడప జిల్లాలో కొత్త…
అనంతపురం జిల్లా మన్నీల రచ్చబండ లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రైతు నేపథ్యం నుంచి వచ్చా… రైతు కష్టం తెలిసిన వాడిని.కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఆదరణ లేక… గిట్టుబాటు కాక నిరాశ నిస్పృహ లో ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి… లక్షల కోట్లు ఉంటే ఏమి లాభం? కౌలు రైతు, రైతులకు కులం ఉండదు. ఒకప్పుడు నేను ఇంటర్ లో బాగా…
సాగు నష్టాలు,ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు.అనంతపురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు.
ఏపీలో ఇప్పుడంతా జగన్ కేబినెట్లో చోటు దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేల గురించే హాట్ టాపిక్ అవుతోంది. పదవి రాలేదని అలిగిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి సీఎం జగన్, పార్టీ దూతలు మాట్లాడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడారు. కోటరీ వల్ల తనకు పదవి రాలేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఎన్టీవీతో ఏ విషయాలైతే మాట్లాడానో.. ఆ విషయాలన్నీ సీఎంకు వివరించాను. https://ntvtelugu.com/yanamala-ramakrishnudu-sattires-on-jagan-cabinet/ పార్టీలో కోటరి చేస్తున్న పనుల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లాను.…
ఏపీలో వివిధ శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. రాష్ట్రంలో కీలకంగా భావించే ఇరిగేషన్ శాఖకు పార్టీ సీనియర్ నేత, అధికారప్రతినిధి అంబటి రాంబాబు మంత్రిగా వచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవిని ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. సమర్ధవంతంగా నా బాధ్యతను పూర్తి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం విషయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. రాయలసీమ సాగు నీటి…
ఏపీలో సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది పాతమంత్రులు అందులో వున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు పినిపె విశ్వరూప్, పెద్దిరెడ్డి, చెల్లుబోయిన, అంజాద్ బాషా. పేదల కోసం డీబీటీ విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. సంక్షేమ ఫలాలు అవినీతి లేకుండా పేదలకు చేర్చుతున్నారు. నవరత్నాలు ప్రజలకు మరింత చేరువ చేస్తాం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. కేబినెట్…
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొనసాగించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలకు క్యాబినెట్ అద్దంపట్టేలా ఉందన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారని కొనియాడారు. https://ntvtelugu.com/jagan-new-cabinet-ministers-portfolios/ బీసీలలో పేదరికాన్ని తరిమేందుకు, విద్యను గ్రామస్థాయిలో అందేలా సీఎం పథకాలు అమలుచేశారు. స్వాతంత్ర్యం తర్వాత బీసీలకోసం ఇంతలా ఆలోచించిన నాయకులు లేరు. ప్రభుత్వంపై బురదచల్లేలా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సినీ పరిశ్రమ ఇబ్బందులు తొలగాలనేది…
ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పాతకొత్త కలయికతో మంత్రులు కొలువుదీరారు. అవినీతిలో కూరుకున్న వారిని కేబినెట్ లోకి తీసుకున్నారని, జగన్ కేబినెట్ లో మంత్రులకు పవర్ ఉందా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎం జగన్ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా? బీసీలను ముఖ్యమంత్రిని చేసి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు టేబుల్ – కుర్చీలైనా ఉన్నాయా? అని సోము…
నూతనంగా కొలువుతీరింది జగన్ 2.O కేబినెట్. మంత్రులకు జగన్ శాఖలు కేటాయించారు. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ…
జగన్ మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. 25 మంది మంత్రులతో జగన్ కేబినెట్ కొలువుదీరింది. అయితే, ఆశించిన మంత్రిపదవి రాకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తనకు మంత్రి పదవి రాలేదంటూ కామెంట్లు చేయడం విశేషం. సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంది. నామినేటెడ్ పదవులు పొంది.. సీఎం క్యాంప్ ఆఫీస్…