Ambati Rambabu: పోలవరం త్వరగా పూర్తిచేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వివిధ శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. రాష్ట్రంలో కీలకంగా భావించే ఇరిగేషన్ శాఖకు పార్టీ సీనియర్ నేత, అధికారప్రతినిధి అంబటి రాంబాబు మంత్రిగా వచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవిని ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. సమర్ధవంతంగా నా బాధ్యతను పూర్తి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం విషయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. రాయలసీమ సాగు నీటి విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం. పోలవరం పూర్తయితే రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. వైసీపీలో కొత్త మంత్రి వర్గ విస్తరణ వల్ల ఏర్పడిన అసంతృప్తి తాత్కాలికమే అన్నారు. అంతా సర్దుకుంటుందన్నారు. ఐదేళ్ళూ ఒకే మంత్రి వర్గం ఉండాలన్నది సరైంది కాదు. ఎవరికి ఏ పోర్టు ఫోలియో ఇవ్వాలి, మార్పులు చేర్పులు అనేవి ముఖ్యమంత్రి ఇష్టం. అన్ని శాఖలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా అంబటి ఎలాంటి మార్క్ చూపిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
అవసరం మేరకు పోర్టు పోలియోలు మార్చిన సందర్భాలు ఉన్న విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లే కాక, రాబోయే ఐదేళ్లలో ఆయనే మఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు అవకాశాలు రానివారు వచ్చే మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుంటారని ఆయన చెప్పారు. ఇరిగేషన్ శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక, కార్యాచరణకు దిగుతానని అంబటి రాంబాబు చెప్పారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!