మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొనసాగించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలకు క్యాబినెట్ అద్దంపట్టేలా ఉందన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారని కొనియాడారు.
బీసీలలో పేదరికాన్ని తరిమేందుకు, విద్యను గ్రామస్థాయిలో అందేలా సీఎం పథకాలు అమలుచేశారు. స్వాతంత్ర్యం తర్వాత బీసీలకోసం ఇంతలా ఆలోచించిన నాయకులు లేరు. ప్రభుత్వంపై బురదచల్లేలా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సినీ పరిశ్రమ ఇబ్బందులు తొలగాలనేది సీఎం లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రకృతి అందాలను, షూటింగ్ స్పాట్లను సినిమా పరిశ్రమ ఉపయోగించుకోవాలన్నారు మంత్రి వేణుగోపాల్. సమాచారశాఖ ద్వారా వాస్తవాలు ప్రజలకు అందిస్తాం అన్నారు. జగన్ కేబినెట్లో గతంలోనూ వేణుగోపాల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తిరిగి జగన్ వేణుగోపాల్ కి అవకాశం కల్పించారు.