ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.…
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా టీడీపీ నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం, నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పలు గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాదుడే బాదుడు పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పన్నులు నిత్యావసర ధరల పెంపుపై టీడీపీ విన్యూత్నరీతిలో నిరసనలు చేపట్టింది. పాలకొల్లు నియోజకవర్గంలో పెంచిన పన్నులు, నిత్యావసర ధరల పెంపుపై ఈ ప్రభుత్వం బాదుడే బాదుడును ఇంటింటికీ కార్యక్రమం…
నంద్యాల జిల్లాలో జగన్ వసతి దీవెన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై బీజేపీ భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. వారిని ఉద్దేశించి వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అనడం బాధాకరం అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరం. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకు? జగన్…
ఏపీలో కరెంటు కష్టాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే.సాధారణంగా ప్రతీ వేసవిలో ను 204 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిపోయింది. పరిశ్రమలు, ఆర్ధిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణం గా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందన్నారు ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత…
ఏపీలో కేబినెట్ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నారు వైసీపీ నేతలు. ఎవరికి అవకాశం ఇవ్వాలి. ఎవరిని కొనసాగించాలనేదానిపై సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ ముగిసింది. వరుసగా రెండో రోజు మూడు గంటల పాటు కొనసాగింది సమావేశం. దాదాపుగా కొత్త మంత్రివర్గం జాబితా సిద్ధమయిందని తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, అనుభవం, పార్టీకి విధేయత అంశాల ఆధారంగా జాబితాను సిద్ధం చేశారంటున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్…
చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చిరకాలం జీవిస్తారని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని.. తమ నాయకుడిని సీఎం జగన్ ఏం పీకలేడని స్పష్టం చేశారు. జగన్ త్వరలోనే జైలుకు పోతాడని.. ఆయన ఉన్న జైలుకు చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి మీకు ముద్ద వేస్తారని కామెంట్ చేశారు. 16 నెలలపాటు జైలులో ఉన్న జగన్ లాంటి చరిత్ర తమకు…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. పీకే ఇచ్చిన నివేదికలో తన ప్రభుత్వ పతనమైందని సీఎం జగన్‌కు తెలిసిందని అందుకే సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. తాను బలంగా ఉన్నాను అనే ప్రయత్నం సీఎం చేస్తున్నారని.. కానీ తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి పీకుడు భాష మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా సీఎం జగన్ ఏం పీకారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి…
విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస ప్రాజెక్ట్ వద్ద బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం కోసం రోజూ ముఖ్యమంత్రి వెళ్లి 55 వేల కోట్లు ఇచ్చేయండి అంటూ మోర పెట్టుకుంటున్నారని, ముఖ్యమంత్రికి ఉత్తరాంద్రా ప్రాజెక్ట్‌లు గుర్తుండటంలేదా అని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ కి దమ్ము, ధైర్యం, ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర…
ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేసారు. కొత్త మంత్రి వర్గం ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనుంది. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ కొత్త మంత్రులు ఎవరు అన్న అంశంపై హాట్ హాట్ గా ఏపీ రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈసారి కొత్త ముఖాలకు బాగానే చాన్సులు దొరికే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో…
ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సహనం పరీక్షించొద్దంటూ పవన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మమ్మల్ని రాక్షసులు.. దుర్మార్గలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డం సరికాదని, వైసీపీ చేసిన తప్పిదాలనే జనసేన మాట్లాడుతోందనే విషయాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం తెలుసుకోవాలన్నారు. నేనూ వైసీపీ నేతల కంటే బలంగా మాట్లాడగలనని, నేను విధానాలపైనే మాట్లాడుతున్నానని.. వైసీపీ అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ సమయంలో ఎంతివ్వాలో…