తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బంది 32 మంది పోలీసులను విచారించనున్న కమిషన్. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ. SLBC టన్నెల్లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు. డీ2, డీ1 ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు. ఆచూకీ…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. ఏపీకి గేట్స్ ఫౌండేషన్ సహకారంపై బిల్ గేట్స్‌తో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా బిల్ గేట్స్ ఉన్నారు. ఏపీకి వివిధ రంగాల్లో సహాయ సహకారాలు…
మనమిత్ర యాప్ ప్రపంచంలోనే మెరుగ్గా తీర్చిదిద్దుతాం అన్నారు మంత్రి నారా లోకేష్.. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వందరోజుల్లో ఏఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తెస్తాం అన్నారు.. కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్.. అలాగే పౌరులకు సంబంధించిన సమాచారం కూడా పూర్తి భద్రంగా ఉంటుందన్నారు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల అంటే ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం.. ఇక, అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. అయితే, గతంలో కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. నేటి కేబినెట్ లో వైఎస్ఆర్ పేరుకు అదనంగా కడప పేరును చేరుస్తూ తీర్మానం చేశారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది..
విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజక వర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తాం అని, ప్రతి ఒక్కరిని విజన్ 2047లో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రతీ ఏడాది 15 శాతం గ్రోత్ రేట్ ఉండాలని, వికసిత్ భారత్ -2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. ఆనాడు హైదరాబాద్‌ను విజన్ 2020 పేరుతో అభివృద్ధి చేశామని,…
ట్రంప్ నా కోసం తన సెక్యూరిటీని పక్కన పెట్టేశారు.. మోడీ కామెంట్స్.. అమెరికన్ పాడ్‌కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్‌తో కలిసి స్టేడియంలో తిరగడం…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హౌసింగ్ అండ్ అర్బన్ డవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో), ఏపీ క్యాపిటల్ రీజియన్ డవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11,000 కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో రాజధాని నిధుల…