ఆ సినిమాలో దారుణంగా నటించా.. సమంత సంచలనం..
స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లో నటించి చాలా రోజులు అవుతోంది. ఆమె చాలా రోజుల తర్వాత సొంతంగా ‘శుభం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తూ మూవీపై హైప్ పెంచుతోంది సమంత. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే అయినా.. నటనతో ఆకట్టుకున్నారని తెలిపింది. వారి నటన చూసి తన కెరీర్ స్టార్టింగ్ గుర్తుకు వచ్చినట్టు చెప్పుకొచ్చింది సమంత. ‘వీళ్ల యాక్టింగ్ చూస్తుంటే నేను కెరీర్ మొదట్లో చేసిన సినిమాల్లో యాక్టింగ్ చూసి ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది. ఏమాయ చేసావే సినిమా ఇప్పుడు చూస్తే ఇంత దారుణంగా నటించానా అనిపిస్తుంది. ఇప్పటికీ యాక్టింగ్ లో కొత్తగా చేయడం నేర్చుకోవాలి. అది ప్రతి యాక్టర్ కు చాలా అవసరం. శుభం సినిమాను చూస్తే అనుభవం ఉన్న నటులు చేశారా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుభం సినిమాను ప్రవీణ్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తున్నారు.
ఉప్పల్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ పేరు తొలగింపు.. అజారుద్దీన్ రియాక్షన్ ఇదే..
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం, స్వప్రయోజనాలు లేవని అజారుద్దీన్ అన్నారు. దీనిపై నేను ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదన్నారు. ఆ స్థాయికి దిగజారాలని అనుకోవడం లేదని.. ఈ అసోసియేషన్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుతోందని విమర్శించారు. తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ గురించి ప్రస్తావించారు. దాదాపు పదేళ్లపాటు టీమిండియా కెప్టెన్‌గా ఉన్నానని గుర్తు చేశారు. సారథిగా డిస్టింక్షన్‌లో పాసయ్యానన్నారు. హైదరాబాద్‌లో క్రికెటర్లను ఇలాగేనా గౌరవించేది? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తప్పకుండా కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సర్వే జరిగిన భూములకు హక్కులు కల్పిస్తాం.. అది మా బాధ్యత..
ఇంద్రవెల్లి సంఘటన జ్ఞాపకార్థం నిర్వహించిన సభలో ఆదివాసుల హక్కుల కోసం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. “అనాటి ఘటన దురదృష్టకరమైనది. అది ఎవరి వైపు నుంచైనా తప్పుగా జరిగి ఉండొచ్చు, కానీ బాధ్యతను మేమే తీసుకుంటాం” అంటూ ఆమె పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, అప్పట్లో రెవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లి అమరవీరుల జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. “అప్పుడు నివాళులర్పించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. నిషేధాలు విధించబడ్డాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇంద్రవెల్లి సంఘటనను ‘సంస్కరణ దినం’గా నిర్వహిస్తోంది,” అని తెలిపారు.
ఎంబీబీఎస్ విద్యార్థులు మాల్ ప్రాక్టీసు వ్యవహారంపై నివేదిక సిద్ధం..
విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలల్లో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకి పాల్పడుతూ పట్టుబడ్డారు. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాల్ ప్రాక్టీసులో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యం ఉన్నట్టు నిర్ధారణ విచారణలో తేలింది. 12 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదిక తేల్చింది. కళాశాల సూపరెండెంట్ ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజలేటర్లు, ఇద్దరు క్లర్క్ లపై చర్యలకు సిఫార్సు చేసింది. ఉద్యోగులపై బదిలీ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నివేదిక రేపు ప్రభుత్వానికి చేరనుంది.
కేసీఆర్ బూతుల రోగం అసద్‌కి అంటుకుందా..?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి AIMIM, కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. BBP అనే కొత్త పదాన్ని విపక్షాలకు ఆయన బిరుదుగా ఉపయోగించారు. BBP అంటే భాయ్ భాయ్ కే పార్టీ, బాప్ బేటే కే పార్టీ, బాప్ భేటి కి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ AIMIM, కాంగ్రెస్, BRSలకే సూచిస్తాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పాల్గొనని పార్టీలకు అంబేద్కర్‌ను వాడుకునే హక్కేంటని ప్రశ్నించారు. BRS, కాంగ్రెస్ పార్టీలు AIMIMకు లొంగిపోయాయా అని చురకలు వేశారు. ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రధాని మోదీపై వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని, ఆయన్ను కూడా కేసీఆర్ బూతుల రోగం పట్టిందా అంటూ తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్‌లో హిందూ దళితుల కోసం CAA వేదన గురించి అంబేద్కర్ ముందే ఊహించారని, ఆయన ఆచరించిన సిద్ధాంతాలను ఈ మూడు పార్టీలకు చెప్పే అర్హత లేదన్నారు.
ఇండీ కూటమిపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..
ఇండీ కూటమిపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిప ఇండి కూటమి సంకీర్ణం కొనసాగుతుంది ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. వక్ఫ్ బిల్లు ద్వారా మాఫియా లాగా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఏ (వెనుకబడిన, దళితులు మరియు మైనారిటీలు) రాష్ట్రం నుండి బీజేపీని తరిమికొడతారని అన్నారు. ఇండియా బ్లాక్ భవితవ్యంగా ఆయన మాట్లాడుతూ.. ఇండీ కూటమి ప్రస్తుతం ఉంది, అలాగే ఉంటుందని చెప్పారు. భూమిని లాక్కోవడానికి బీజేపీ వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని, వారు ఎక్కడ చూసినా భూమిని ఆక్రమించుకుంటారు అని అన్నారు. బీజేపీని భూ మాఫియా పార్టీ అని పిలిచారు.
విప్లవాల జిల్లా ఖమ్మంలో కామ్రేడ్స్ మౌనం వహిస్తున్నారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర నివాసాన్ని కవిత సందర్శించగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం.. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్జెసీ కృష్ణను పరామర్శించారు కవిత.
ఖమ్మంలో గాయత్రి రవి నివాసంలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడుమంది మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కలుగడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. “అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కనీస నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం, సిస్టర్ పొంగులేటి సీతక్కదె నిన్న ములుగు పర్యటనలో ఉన్నా, వైద్యం అందక చనిపోయిన శిశువు విషయంలో స్పందించలేదు” అని ఆరోపించారు.
నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలోనే మరో ముందడుగు…
నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలోనే మరో ముందడుగు పడింది. మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ధ్యేయం చొరవతో టీం శివంగిని ఏర్పాటు చేశారు. అయితే.. టీం శివంగిని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అన్నింటిలో ముందుండాలి అని ఎస్పీ జానకీ షర్మిల కృషి అమోఘమన్నారు. ఈ మధ్య మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురి ఆడవారిని వెతికి పట్టుకోవటం లో వీరు పడ్డ కష్టం అభినందనీయమని, రాష్ట్రం అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే శివాంగి టీం లు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. శిక్షణను కష్టం అనుకోకుండా ఇష్టం తో చేయాలని సూచించారు.
కొల్లేరు సరస్సు శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడింది..
కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత కుటమి ప్రభుత్వానిదన్నారు.
హిందువులకు ‘‘ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక’’.. కుల భేదాలు తొలగాలి..
హిందూ సమాజంలో కుల భేదాలు అంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. హిందువులకు ‘‘ఒక ఆలయం, ఒక బావి, ఒక శ్మశానవాటిక” అనే సూత్రాన్ని స్వీకరించడం ద్వారా సామాజిక సామరస్యం కోసం కృషి చేయాలని అన్నారు. అలీఘర్‌లో 5 రోజుల పర్యటనలో ఉన్న మోహన్ భగవత్, హెచ్‌బీ ఇంటర్ కాలేజ్, పంచన్ నగ్రీ పార్క్‌లోని రెండు శాఖలలోని స్వయంసేవకులతో మాట్లాడారు. శాంతి కోసం భారత్ తన ప్రపంచ బాధ్యతను నెరవేర్చడానికి సామాజిక ఐక్యత సాధించడం చాలా ముఖ్యమని అన్నారు. హిందూ సమాజానికి పునాది సంస్కారం, విలువలు అని నొక్కి చెప్పారు. సంప్రదాయం, సాంస్కృతిక విలువలు, నైతిక సూత్రాలు కలిగిన సమాజాన్ని నిర్మించాలని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు చేరువ కావాలని, అట్టడుగు స్థాయిలో సామరస్యం, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వారిని ఇళ్లలోకి ఆహ్వానించాలని స్వయంసేవకుల్ని కోరారు.