సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు ఈ రోజు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు.. దీంతో, 24 రోజుల ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. అయితే, ఇతర కేసుల్లో బెయిల్ మంజూరు అయినా.. పోసానికి సీఐడీ నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ దక్కడంతో గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు.. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తన సన్నిహితులతో కలసి హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు పోసాని కృష్ణ మురళి.. అయితే, పోసాని…
ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హత నిర్ధారణ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖ రాశారు.. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అర్హత నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కు అనుగుణంగా రాష్ట్రంలో కుడా నిర్ణయం తీసుకోవాలని సీఎంను లేఖలో కోరారు..
పాక్లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్…
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత సీఎం చంద్రబాబు దే అన్నారు. కల్చరల్స్ చూస్తూ నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమా గుర్తొచ్చింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని కడుపుబ్బ నవ్వేలా చేసారు అని పేర్కొన్నారు.
AP Deputy Speaker: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లెజిస్లేచర్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు.
Botsa Satyanarayana: సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రైతుల దాకా అందరినీ మోసం చేసింది తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బడ్జెట్లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆక్షేపిస్తూ, ఎన్నికల ముందు వంద రోజులలో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజా బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన…
నేడు బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంకు సీఎంతో పాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. స్పోర్ట్స్ మీట్లో విజేతలకు చంద్రబాబు బహుమతులు అందించనున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం ఆరంభం కానుంది. ఏపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్ నేటితో ముగియనుంది. లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో కళాకారులు పలు కళాకృతులు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబంతో కలిసి నేడు, రేపు తిరుమల పర్యటనకు వెళుతున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్తో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం దర్శించుకోనున్నారు. చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం…
అర్జున్ S/o వైజయంతి థియేట్రికల్ బిజినెస్ అదిరింది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని…