లేడీ అఘోరీపై కేసు..! వశీకరణంతో నా కూతుర్ని తీసుకెళ్లి..! తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరి హల్ చల్ చేస్తోంది.. కొన్ని చోట్ల ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి… తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి…
కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణా అధికారులు అన్నారు సీఎం చంద్రబాబు. ఏసీ రూమ్లకు కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు.. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్ని విషయాలు ప్రస్తావించారు... విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు..
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు శుభావార్త చెబుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు.. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు పోస్టింగుల్లో ఉండాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ సమావేశాలు జరుగనున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగనున్నది. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం జరుగనుంది. ఆ తర్వాత సీఎస్.. రెవెన్యు మంత్రి.. ఆర్ధిక మంత్రి ప్రసంగాలు ఉండనున్నాయి. Also Read:Rishabh Pant: రూ. 27 కోట్లు గంగలో కలిసినట్లేనా..? రిషబ్ పంత్ ప్లాప్ షో! తర్వాత…
ఎంఎంటీఎస్ ఘటన బాధితురాలికి బండి సంజయ్ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన…
పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్ పీ4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీ4 విధానానికి తుదిరూపు ఇచ్చారు. ఉగాది సందర్భంగా అమరావతిలో పీ4 ప్రారంభం అవుతుందని సీఎం వెల్లడించారు. సాయం అందించే చేతులకు వేదిక పీ4 అన్నారు. సంపన్నులు – పేదలను ఒకేచోటుకు చేర్చడమే దీని లక్ష్యమని తెలిపారు. ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చని కోరారు. పేదలకు అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం అని సీఎం…
వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు జరగనుంది.. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది.. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పధకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పి.ఫోర్ కార్యక్రమంపై…
ఎండల తీవ్రత దృష్ట్యా.. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు.. ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు వీలుగా స్కూళ్లలో వాటర్ బెల్ మోగించాలని తెలిపారు..
వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. వేసవి కారణంగా నీటి ఎద్దటి సమస్య, వడగాల్పులు, ఎండల ప్రభావం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించారు సీఎం
పోచారం ఐటీ కారిడార్లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో…