24 గంటల పాటు అన్నదానం సాగె దివ్యక్షేత్రం కాశినాయన క్షేత్రం అని, అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో కూలగొట్టిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బుల్డోజర్తో కాశినాయన క్షేత్రంను కూల్చారన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే సీఎం చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగిందన్నారు. నిరసన, తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి నారా లోకేష్ తానే కట్టిస్తా అన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు…
పాక్లో వరస దాడులు.. బలూచిస్తాన్లో ఆర్మీ కన్వాయ్పై ఎటాక్.. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.…
ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదు.. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం, ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. బీసీ కుల గణన లెక్కలు తప్పు అంటున్నారు.. ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. 1931 తర్వాత.. ఇప్పుడు తాము చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీసీలకు…
అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పను.. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబధిత అధికారులపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర నా లక్ష్యం.. అక్టోబర్ 2 తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు..
పార్లమెంట్లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు..
వివిధ అంశాలపై ఇప్పటికే ఎన్నో సార్లు బహిరంగ లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు బహిరంగ లేఖ అంటూ ఓ లేఖ రాశారు.. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుమారు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. మరో 50 వేల కోట్లు ఖర్చు చేయడనికి కూడా సిద్ధం అవుతున్నారు.. పరిపాలన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు.. తణుకులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివ్స’ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం-పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే థీమ్తో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో సమావేశం కానున్నారు..
పవన్ అన్న అంటూ లోకేష్ ట్వీట్.. మంత్రి స్పెషల్ విషెస్ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు. పవన్ అన్నకు అంటూ ఆప్యాయంగా స్పందించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో జనసేన పనితీరు ఎంతో కీలకం అన్నారు. ఆ పార్టీ కమిట్ మెంట్ ఏపీ అభివృద్ధికి చాలా కీలకం అన్నారు. భవిష్యత్…
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు.. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చిన యువతులు.. వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయించిన ముఠా.. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. ఇక,…
పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్న ఆయన.. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని స్పష్టం చేశారు..