CM Chandrababu: నేడు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు.. ఢిల్లీ షెడ్యూల్ ఇదే!
- అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
- నేడు కేంద్రమంత్రులతో సీఎం కీలక సమావేశాలు
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక మంతనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు.. పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు స్వాగతం పలికారు. రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు.. నేడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.
రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ అంశాలు, కూటమి వ్యవహారాలపై కేంద్రమంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఏపీ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక మంతనాలు జరపనున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2న అమరావతికి వస్తున్న నేపథ్యంలో.. అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి కేంద్ర హోం మంత్రికి సీఎం వివరించనున్నట్లు సమాచారం. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్‌ను సీఎం కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు షెడ్యూల్:
# ఉదయం 10.30కి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‍తో సమావేశం
# ఉదయం 11.15 గంటలకు కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్‌తో భేటీ
# మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం
# మధ్యాహ్నం 1.40కి అమిత్ షాతో భేటీ
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!