Chandrababu Success Story: పదహారేళ్లు ముఖ్యమంత్రి.! పదిహేనేళ్లు ప్రతిపక్ష నేత..! నాలుగు పదులు దాటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం..! గెలిస్తే పొంగిపోడు..! ఓడితే కుంగిపోడు..! పట్టుదల, ఓర్పు, సహనానికి నిలువెత్తు రూపం. ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలు..! అయినా వెనకడుగు వేయలేదు. ఎంతటివారినైనా తనవైపు తిప్పుకోగల నేర్పరి..! ప్రజా క్షేత్రంలో ఒప్పించి మెప్పించి నెగ్గుకురాగల గడసరి. పడిలేచిన కెరటమై తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర రాజకీయాలే కాదు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్.. ఇదీ చంద్రబాబు సింపుల్ ఇంట్రడక్షన్.
Read Also: Rashmi : హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. అసలేమైందంటే..?
అయితే, తెలుగు రాష్ట్రాల్లో టీడీపీది ఒక చెరగని ముద్ర. తెలుగు చరిత్రలోనే చెరగని సంతకం. తెలుగు వాళ్ల ఉనికికి కాపాడిన పార్టీ.. అలాంటి పార్టీకి ప్రాణవాయువు దశ, దిశ, అన్నీ చంద్రబాబు నాయుడే. అలాంటి చంద్రబాబు 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు.. మరెన్నో మైలురాళ్లు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఎన్నాళ్లు అధికారంలో ఉన్నారో..అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ప్రతిపక్షంలోనూ ఉన్నారయన. గెలుపు, ఓటమిని ఒకేలా చూసుకునే రాజకీయ నేత చంద్రబాబు. రాజకీయాల్లో గెలవడమే కాదు… ఓడిపోయినా కూడా తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. ఆయన రాజకీయాలకు గెలుపు ఓటములతో సంబంధం ఉండదు. నిత్యం ప్రజల్లో ఉంటారు. ఓపిగ్గా సమస్యలు వింటారు. పరిష్కారం దిశగా అడుగులేస్తారు. టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ కదనరంగంలో దూసుకుపోవడం ఆయన స్పెషాలిటీ.
Read Also: Tarun Bhaskar : తన తండ్రి కల నెరవేర్చిన టాలీవుడ్ డైరెక్టర్ ..
ఇక, తెలుగు గడ్డపైనే కాదు..! జాతీయ రాజకీయాల్లో చంద్రన్న చక్రం తిప్పారు. అటు యూపీయే, ఇటు ఎన్డీయేలో కీ రోల్ పోషించారు. దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రధానుల్ని చేయడంలో చంద్రబాబుదే మాస్టర్ మైండ్. ఇప్పుడు మళ్లీ ఎన్డీయే ప్రభుత్వంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కాగా, దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయేలకు కన్వీనర్‌గా పలువురు ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇప్పుడు మరోసారి జాతీయస్థాయిలో కీలకంగా మారిపోయారు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని సీట్లు బీజేపీకి రాకపోవడంతో టీడీపీ సపోర్ట్ కీలకమైంది. ఎన్డీయే పక్షాల్లో బీజేపీ తర్వాత, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ టీడీపీనే కావడంతో మరోసారి ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు.
Read Also: Purandeswari: మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువైపోతున్నాయి..
కాగా, ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబుకు వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో ఆయన యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ చూపి, దానికి కన్వీనర్ అయ్యారు. దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రధానులుగా ఎంపిక చేయడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ సమావేశాలకు చంద్రబాబు బస చేసే ఏపీ భవన్ కేంద్రస్థానంగా ఉండేది. ఇక, 1998లో కేంద్రంలో బీజేపీకి టీడీపీ మద్దతిచ్చింది. చంద్రబాబు కన్వీనర్‌గా ఎన్డీయే ఏర్పాటైంది. వాజపేయీ ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర నిర్వహించారు. ఆ ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతిచ్చారు. రాష్ట్రపతిగా అప్పట్లో అబ్దుల్ కలాం ఎంపికలోనూ ఆయనదే కీ రోల్. జీఎంసీ బాలయోగిని లోక్‌సభకు స్పీకర్‌గా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేశాయి. ఈ కూటమికి జనసేన మద్దతిచ్చింది. టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరింది. ప్రత్యేక హోదా, విభజన హామీల లాంటి కొన్ని అంశాల్లో విభేదించి 2019 ఎన్నికలకు ఏడాది ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగింది.
Read Also: Indravelli Martyrs Day: నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం.. మొదటిసారి అధికారికంగా..!
అయితే, మళ్లీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ చేశారు. ఎవ్వరినైనా ఒప్పించగలిగే నేర్పు శక్తి చంద్రబాబుకు ఉంది. అప్పటిదాకా మోడీపై ఓ రేంజ్ లో విమర్శలు చేసిన చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేలా కమలనాథుల్ని ఒప్పించగలిగారు. ఇటు తనకంటే చిన్నవాడైన పవన్ కల్యాణ్ తో స్నేహపూర్వక రాజకీయాలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి బంఫర్ విక్టరీ తెచ్చిపెట్టారు. ఎక్కడి నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన నేత చంద్రబాబు. తనదైన మార్క్ పాలిటిక్స్ తో మళ్లీ ఏపీ రాజకీయ తెరపై మెరిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 21 లోక్‌సభ స్థానాల్ని కూటమి గెలుచుకుంది.
Read Also: KTR: రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారు.. ప్రచారానికి సిద్ధం అవ్వండి!
అలాగే, డెవలప్మెంట్ కు ట్రేడ్ మార్క్ అని చంద్రబాబుకు పేరుంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఆయన పాత్రను ఎవరూ చెరిపేయలేరు. హైటెక్ సిటీ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబుది. ఐటీ పరిశ్రమ రాకకోసం ఆయన చేసిన కృషి తరతరాలుగా చెప్పుకుంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్లో అతడు చూపిన చొరవ ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం గుర్తు చేస్తుంటారు. పాలిటిక్స్ లో ప్రతీ ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంటుంది. చంద్రబాబుది ఐటీ బ్రాండ్. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. టెక్నాలజీపై ఆధారపడతారు. ఒక్కో టర్మ్‌లో ఒక్కో విధానాన్ని అవలంబిస్తూ వచ్చారు. కొన్ని సార్లు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. వెనకడు వేయలేదు.. లోటు పాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగారు. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఐటీ హబ్‌గా మార్చడంలో ఆయన కృషి ఎనలేనిది. ఐఎస్‌బీ, ఐఐఐటీ వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్ని ఏర్పాటు చేశారు. బిల్‌గేట్స్ వెంటపడి, ఒప్పించి మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించేలా చేశారు చంద్రబాబు.
దీంతో పాటు అడ్మినిస్ట్రేషన్ మీద విపరీతమైన పట్టు ఉంటుంది.. నేను నిద్రపోను.. మిమ్ముల్ని నిద్రపోనివ్వవనని సీఎంగా చంద్రబాబు.. అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. పాలనలో పారదర్శకతను చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రైతుబజార్ల ఏర్పాటు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.
ఇక, తెలుగు వాళ్ల చరిత్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసింది మరొకరు లేరు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టించారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట. దాన్ని ఆయన ఆచరణలో చూపించారు. 2014లో రూ.16వేల కోట్ల ఆర్థిక లోటుతో, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో రెండు నెలల్లోనే 33 వేల ఎకరాలు సమీకరించారు. ఇక, 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ చేతిలో టీడీపీ ఓడిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏపీ పాలన పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం, పరిశ్రమల్ని తేవడం చంద్రబాబు ముందున్న అసలు సిసలైన సవాళ్లు..