కాకినాడ: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించనున్న పవన్. వందపడకల ఆసుపత్రితో పాటు టీటీడీ కళ్యాణ మండపానికి శంకుస్థానప చేయనున్న పవన్. గొల్లప్రోటు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానాలకు శంకుస్థాపన.
ఐపీఎల్: నేడు చెన్నైతో తలపడనున్న హైదరాబాద్. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ. మే 2న ఏపీ పర్యటనకు ప్రధాని మోడీకి ఆహ్వానం. ప్రధాని పర్యటను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.
హైదరాబాద్: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. జీహెచ్‌ఎంసీలో ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం.
నేటి నుంచి రెండ్రోజులపాటు హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్. 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కీలక ప్రసంగాలు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుల అలర్ట్. హెచ్‌సీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాలలో పటిష్టమైన నిఘా.
తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ గురుకులాల దరఖాస్తులు. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ. మే 15 తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ.
ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలకు ఓవైసీ పిలుపు. నేడు నల్లరిబ్బన్లు ధరించి నమాజ్ చేయనున్న ముస్లింలు. ఉగ్రదాడికి నిరసనగా క్యాండిల్ మార్చ్‌కు ఎంఐఎం పిలుపు.
నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. పహల్గామ్‌లో ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆందోళనలు. మృతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల మార్చ్. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కొవ్వొత్తుల మార్చ్.
నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఆదిలాబాద్, కుమురంభీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్.
నేడు ఏపీలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు. 21 మండలాల్లో వడగాలుల ప్రభావం. ఏపీలో రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.
నేడు జమ్ముకశ్మీర్‌లో రాహుల్ పర్యటన. ఉగ్రదాడిలో గాయపడ్డవారిని పరామర్శించనున్న రాహుల్. ఉదయం అనంతనాగ్ జీఎంసీలో బాధితులకు పరామర్శ.
నటి జత్వాని కేసులో సీఐడీ పిటిషన్‌పై నేడు విచారణ. అంజనేయులను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్.
నేడు పహల్గామ్‌కు భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఉగ్రదాడి జరిగిన స్థలాన్ని పరిశీలించనున్న ఆర్మీచీఫ్. జమ్ముకశ్మీర్‌లో భద్రతను సమీక్షించనున్న ద్వివేది.